నాన్న
చిటికెన వ్రేలును దిక్సూచి గా మార్చి,భుజస్కందాన్ని భద్ర సింహాసనంగా చేస్తాడు. సాన్నిహిత్యాన్ని సాహిత్య సమ్మేళనంగా తీర్చి, అనుభవసారాన్ని గీతా సారంగా బోధిస్తాడు. పలుకులకు జ్ఞాన వాచకమై నడవడికి నీతి శతకమై, ఈప్సితాలకు కల్పతరువై, లక్ష్య సాధనకు నిత్య శ్రామికుడౌతాడు. ఆచరణకు తాను ధార్మికుడై నిలుస్తాడు. కుటుంబానికి దాన కర్ణుడిలా మారిపోతాడు. అవసరాలలో శిబి చక్రవర్తి గా అనిపిస్తాడు. అనురాగాన్ని అమృతంగా పంచుతాడు. కష్టాలకు కొవ్వొత్తిలా కలుగుతారు, పిల్లల భవిష్యత్తును బ్రహ్మలా లిఖిస్తాడు. సవాళ్ళను సైనికుడిలా ఎదిరిస్తాడు, కుటుంబాన్ని రామచంద్రుడిలా పాలిస్తాడు. హృదయాన్ని కోవెలగా మారుస్తాడు, మమతల దివ్వెను వెలిగిస్తాడు. వరాలిచ్చే దేవుడే ఈర్ష్య పడేలా, ఇల్లు అనే ఆలయానికి ధ్వజస్తంభం లా నిలుస్తాడు. ఆయనెవరో కాదు *నాన్నే!* ........................................... ~ అడుసుమల్లి రవి కుమార్