పోస్ట్‌లు

2022లోని పోస్ట్‌లను చూపుతోంది

సన్ ఆఫ్ సూర్య నారాయణ

నాన్నా... ⚜️కాస్తంత కష్టం ఎదురైన ప్రతిసారీ మీరు చూసిన ఎత్తుపల్లాలు గుర్తొస్తాయి. ⚜️మీ గుండె నిబ్బరం గుర్తొస్తుంది. కుటుంబమంటే మనమే కాదు, మన తోటి వాళ్ళు కూడా అనే మీ ఔదార్యం గుర్తొస్తుంది. ⚜️ఎవరెన్ని తప్పులు చేసినా, క్షమించిన మీ ప్రేమ గుర్తొస్తుంది.  ⚜️మీరు నేర్పిన జీవిత పాఠాలు గుర్తొస్తాయి. ⚜️కష్టాలెన్ని ఎదురైనా చలించని మీ ధీరత్వం గుర్తొస్తుంది.  ⚜️ఆస్తుల కన్నా చదువే గొప్పదన్న మీ మాటలు గుర్తొస్తాయి. ⚜️అసలేం లేకున్నా, బాధ పడని మీ ధైర్యం గుర్తొస్తుంది.  ⚜️అన్నిటికీ మించి మా స్వేచ్ఛను, మా ఆశల్ని సజీవంగా ఉంచిన మీ గొప్ప వ్యక్తిత్వం గుర్తొస్తుంది. ⚜️మీరు ఎప్పటికీ మా మార్గదర్శి..మా టార్చ్ బేరర్. అందుకే నేనంటాను ❤️మై డాడ్ ఈస్ మై హీరో❤️ ~ సన్ ఆఫ్ సూర్య నారాయణ

మోయకండి... వదిలించుకోండి

ఒక 100ml నీళ్ళ బాటిల్ పట్టుకొని నిలబడటం పెద్ద కష్టం కాదు. కానీ 10 నిమిషాలు పెట్టుకున్నాం పెద్దగా ఒత్తిడి ఏమి ఉండదు. గంట పెట్టుకున్నాం అది కూడ పెద్ద సమస్య కాదు, 3గంటలు పెట్టుకున్నాం ఒత్తిడి ప్రారంభం. 5గంటలు ఒత్తిడి పెరుగతోంది నిమిష నిమిషానికీ ఒత్తిడి పెరిగి బాటిల్ విసిరి కొడతాం.. అక్కడ దాని బరువు మారలేదు. ఫీలింగ్ మారిపోయింది. మనకి ఉన్న విషయాల్లో కూడా అనవసర విషయాలని పదేపదే గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి మోస్తూ ఉంటే, చివరికి మానసిక ఒత్తిడి పెరిగి, నిర్ణయాలు వికటించి, పరిస్థితులని, మనస్సుని, శరీరాన్ని ప్రభావితం చేస్తాయి.  కనుక ఏ విషయాన్నైనా మోయకండి.. ఎక్కడిది అక్కడ వదిలేయండి. పట్టుకున్నంత మాత్రం చేత సరికాని విషయం సరవ్వదు. పట్టుకోపోయినంత మాత్రాన సరయ్యే విషయం సరికాకుండా పోదు..అనవసరమైన మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. శుభరాత్రి  ~ అ ర కు

పోరాడు...గెలిచేస్తావ్

చిత్రం
ఈ బరువు మోయలేవు! బిగ్గరగా అరవాలనుకుంటావు. నీలోంచి నీ చేయే నీ నోరు మూసేస్తుంది. కలల వంతెన మీద జారి పడుతున్నప్పుడల్లా, అగాధం కండ్ల ముందుకొచ్చి భయపెడుతుంది. పోరాడి పోరాడి ఓటమి ముందు కుప్పకూలిపోవటానికి నిన్ను నువ్వే అప్పగించుకునే పరిస్థితులు వస్తాయి. గతంలోకి తొంగి చూడకు. మానని గాయాలు చేతులకు తగులుతాయి. నడుస్తూ నడుస్తూ వెనుకకు తిరిగావా పాత స్మృతులేవో నిన్ను తగులబెట్టి చలి కాచుకుంటాయి. రాళ్ల దెబ్బల గుర్తులకు కాలమే మందు గాయాలు పాతవే, తెగింపే ఎప్పుడూ కొత్తగా వుండాలి. నీ ఆశయాలకి నువ్వే కదా "ది ప్రిన్స్"! ఉపాయం కనిపెట్టి, ఓర్పుగా, నేర్పుగా పోరాడు..గెలిచేస్తావ్! శుభోదయం ~ అ.ర.కు

శంకరా

తొలుగును పాపదోషములు తోయమునిచ్చిన నీకు శంకరా! వెలుగును కాంతి దీపములు, వేదన తీరును నిన్ను గాంచినన్, కలుగును సర్వ భాగ్యములు, కామన తీరగ నిన్నుగొల్చినన్! తలిచెద నీ నామమునే, తెలిసినది దేవర నీ మహిమెంత శిఖరమో! ఓం నమఃశివాయ

నీకంటే తోపెవ్వడు లేడిక్కడ

చిత్రం
మదిని మెలిపెడుతున్న మాటల ప్రవాహాలు, మతిని చెడగొడుతున్న జ్ఞాపకాల సమూహాలు, తనకు తానే లేని ఒంటరి పయనాలు, మనసే ప్రత్యర్ధైన కఠిన సమరాలు, ప్రయత్నమే లేక  ఓడిపోతూ, మళ్ళీ మళ్ళీ ఒంటరయ్యే సమయాన.. తను గీసిన పరిధిని దాటి విధి ఆడితే.. విధి ఆడిన వింత ఆటలో నువ్వు పావుగా మారితే.. మౌనముద్ర దాల్చిన బ్రహ్మను నిందించలేక, మూగబోయిన మహావిష్ణువుని మాటైనా అనలేక, కాంక్షించిన కోర్కెలు కనుమరుగవుతుంటే, ఊపిరిసలపని ఊసులు ఊగిసలాడుతుంటే, కనుల వాకిట బంగారు భవిత చితికిపోతుంటే చితికిన కోర్కెలనడుమ బతుకు ఏమవుతుందో?? అప్పుడే నీలోని శూన్యం లోకి ఒక్కసారి తొంగి చూడు.. దీర్ఘశ్వాస తీసుకో, మళ్లీ మొదలెట్టేయ్! నీకంటే తోపెవ్వడూ లేడిక్కడ!! ~ అ.ర.కు

మండు వేసవిలో కుండపోత వర్షం

చిత్రం
మండు వేసవిలో కుండపోత వర్షం.... 💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦 పిలవని పేరంటానికి వచ్చిన అతిథి కాదు, జీవకోటి ఘోష విని, పలుకరించిన మురళి గానం. ఎండిపోయిన మాను, మోడు కు ప్రాణదీపం. మట్టి గంధపు పరిమళాల దివ్య వాహిని. ఎండ మంటకు కమిలిన గాయాలకు భిషక్కు. పశు, పక్షి గణాల దప్పిక తీర్చే చలివేంద్రం. మాసిన బతుకులు శుద్ధి చేసే పరిచారిక. భూగర్భంలో ఇంకిపోయే అమృతధార. ~ అడుసుమల్లి రవి కుమార్

పుస్తకం మన అస్తిత్వం

చిత్రం
పుస్తకం.... నా ఒంటరి నేస్తం! అజ్ఞానపు దారిలో వెలుగు దీపం! కాలక్షేపానికి మందు ఉత్సాహానికి ప్రేరణ నిరాశకు బద్ధ శత్రువు బద్ధకానికి బుద్ధి చెప్పే గురువు! ఒంటరితనంలో నీడలా వెంటుండే తోడు. మస్తకాలను పదునుపెట్టే సానరాయి! ఆలోచనల నిప్పురవ్వల్ని రాజేసే చెకుముకి రాయి! కొత్త లోకపు మెట్లు ఎక్కించి మైమరపింపచేసే మాయా దర్పణం! అక్షరాల తోటలో నిత్య పరిమళాల సుగంధం మానవునికి దైవం అందించిన వరప్రసాదిని! చదవండి...చదివించండి..చదవడం మాకిష్టం అనేలా!! పుస్తకం మన అస్తిత్వం. ~ అడుసుమల్లి రవి కుమార్ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు.

యోధుడివి

చిత్రం
జీవితంలో ఒక్కోసారి.. ఆగిపోతావ్, దిగాలుపడిపోతావ్ "పోవడం" కామనైనప్పుడు ఎదిగి పోయినా, చితికి పోయినా పోతూనే ఉండు! అందరికీ దండలో పూలే కావాలి. అవే ఊడిపోతే, దారాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు! గెలుపు గుంపుని తీసుకొస్తే, ఓటమి ఒంటరితనాన్ని తీసుకొస్తుంది!  గుంపే నిజం అని గెలుపులో మురిసిపోతాం, మనమే నిజం అని ఓటమిలో తెలుసుకుంటాం! నీకు నువ్వే అనుకొని ప్రయాణం సాగిస్తూ ఉండు! చెయ్యరా యుద్ధం నీవొక యోధుడివి పుట్టుక తోనే!! ~ అడుసుమల్లి రవి కుమార్

నాన్న

చిత్రం
తెలుగు లో మాట్లాడటం నాకు ఇష్టం. నాన్న అని పలకడం మరీ ఇష్టం!

నమామి గణేశ

చిత్రం
నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం  నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్దరం  సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం  మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్