పోస్ట్‌లు

2021లోని పోస్ట్‌లను చూపుతోంది

వైకల్యం

చిత్రం
కొత్త సంతోషాలను కోరుకోవడం కాదు, కలిగి ఉన్న సంతోషాలను తెలుసుకోవాలి. పోగొట్టుకున్నవి విలువైనవే కావచ్చు, కలిగిఉన్నవి అంతకంటే విలువైనవి. వైకల్యమంటే కలిగి ఉన్న వాటిని తెలుసుకోలేకపోవడమే! ~ అ.ర.కు ᪥❀శుభరాత్రి❀᪥

స్వేచ్ఛ అందరికీ

చిత్రం
నీకు విధేయులు కాని వారందరూ నీకు శత్రువులు కాదు. స్వేచ్ఛ అందరిదీ!

నాన్న

చిత్రం
నేను పలుకుతున్న అక్షరమే కాదు నాన్న నా లోపలి లక్షణం నాన్న! నా వేలు పట్టి నడిపిన గురువే కాదు నాన్న! నా వేల జ్ఞాపకాల ఖజానా నాన్న! నా వరం, నాస్వరం,  నేను అనే పదానికి దర్పణం నాన్న! మై డాడ్ ఈజ్ మై హీరో! 🎈శుభోదయం 🌹

గుసగుసలాడే చలి

శీతాకాలపు సాయంత్రాలు.. నడిచే దారి నిండా రాలిపోయిన ఆకులు,  రాలడం తిరిగి చిగురించేందుకేననీ వెండి పాదాలతో  నడుస్తున్న వెన్నెల, ఒకనాడు కనుమరుగై తిరిగి కనువిందు చేస్తుందనీ, చెవుల్లో గుస గుస లాడుతోంది చలి,  నీటి మూటలను మోస్తున్న గడ్డిపరకల సాక్షిగా..!! ~ అ.ర.కు

జీవితం

ఏదో ఒకటి తెలుస్తూనే ఉంటుంది, కొత్తగా ఏదో నేర్చుకున్నట్టుగానే ఉంటుంది,  ఒకరిద్దరైనా కలుస్తారు. వాళ్ళు నాలోకి, నేను వాళ్ళలోకి పయనించాక ఎవరమూ ఒక్కరిగా మిగలం. కన్నీళ్లుగానో, బిగ్గర నవ్వులుగానో, లోపలికి ముడుచుకున్న మనుషులుగానో మారి, ఆ కలయికల పిదప విడివడి వచ్చిపోయే కరెంటుకు వెలిగి ఆరిపోయే బల్బుల్లా మిగిలిఉంటాం. నువ్వెవరికోసం వెతుకుతుంటావో, నిజానికి వాళ్ళు నీ ఎదుటే వుంటారు, ఎలాగైతే నిన్ను నీవు గుర్తుపట్టనట్టు వాళ్లనూ గుర్తుపట్టవు. మేల్కొని ఉన్న రాత్రుల్లో జీవితం నీ సమక్షంలో తచ్చాడినట్లు ఆ క్షణాల్లో మాత్రం బతికుంటావు. ఆ బతికిన ఘడియల గడియ తీయడం, మూయడం మాత్రమే జీవితం.

అన్నాచెల్లెళ్ల అనుబంధం

*అలసిన వేళ అమ్మలా జోలపాడి,అలిగిన వేళ నాన్నలా అలక తీర్చిన జ్ఞాపకాల బాల్యం* అన్నాచెల్లెళ్ల అనుబంధం

వాక్కే భూషణం

కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా  న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః  వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే  క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం   భావము: మనిషికి బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు అలంకారం కాదు. పూల మాలలు, పరిమళద్రవ్యాలు, స్నానాలు ముఖ్యం కాదు. సంస్కారంతో కూడిన మాటలే మనిషికి సిసలైన అలంకారాలు. పైవన్నీ క్షీణించేవే, క్షీణించని మంచి మంచిమాటయే సిసలైన ఆభరణం

నా అక్షరాలు

చిత్రం
నే రాసే అక్షరం... గుండె చీల్చుకొచ్చినా నెత్తురోడదు.. భావాలు, భావోద్వేగాలనే ఒలికిస్తుంది తప్ప! కన్నీటిలో పుట్టుకొచ్చినా కాగితాన్ని తడుపదు..బాధని, ఆవేదనను ఒంపుతుంది తప్ప! ప్రేరణ నింపేలా పిడికిలి బిగించినా... మనిషిలోకి తొంగిచూసే తలుపై తెరిచినా.. మదిలోకి ప్రసరించే వెలుగై నిండినా... నా అక్షరాలు చెదరని, బెదిరని సూర్య చంద్ర ప్రకాశాలు! ~ అడుసుమల్లి రవి కుమార్

మా నాన్నే మా హీరో

చిత్రం
On behalf of my DAD's birth anniversary 💕 ఎదలోతుల్లో అంతులేని బాధలెన్ని ఉన్నా మమతల పచ్చని తివాచీని కప్పి, మది పొరల కదిలికలు తెలియనివ్వక, మా కలలను సాకారం చేసిన సూపర్ మ్యాన్ మా నాన్నే.. నడి సంద్రంలో మునిగే మా నావను ఒడ్డుకు చేర్చిన ధైర్యం మా నాన్నే.. ఎడారిలో తడారిన మా గొంతులకు దాహం తీర్చిన ఒయాసిస్సు మా నాన్నే.. మండుటెండల తాపంలో నీడలా వెంట నడిచిన చల్లని మేఘం మా నాన్నే.. ఓటమి అంచున నేనుంటే, విజయం దిశగా పరుగెత్తించిన గొప్ప గురువు మా నాన్నే.. తప్పటడుగులు వెస్తున్నా, ఆటుపోట్లు ఎదురైనా నా భుజం తట్టి ధైర్యం చెప్పిన గొప్ప స్నేహితుడు మా నాన్నే.. నిస్సత్తువతో నేనున్నా, అనారోగ్యంతో బాధ పడుతున్నా, నా బాధలన్నిటికీ గొప్ప మందు మా నాన్నే.. ఎప్పటికీ 𝗠𝘆 𝗗𝗮𝗱 𝗶𝘀 𝗠𝘆 𝗛𝗲𝗿𝗼 ~ అడుసుమల్లి రవి కుమార్

ఎమోషనల్ పోస్ట్

చిత్రం
ఈ రోజుల్లో కొంతమంది మృగాళ్ళకు ఆడది అంటే...పైభాగం మరియు క్రింద భాగం అంతే!  అంతకు మించి వేరే ఏది ఆలోచించరు😏😡 కాని అసలు నిజం ఏమిటంటే.. పై భాగం మన ఆకలిని తీర్చినది, క్రింద భాగం మనకు జన్మనిచ్చినది.👩‍👧‍👧 ఈ నిజాన్ని గుర్తు పెట్టుకుంటే ప్రపంచములో ఏ ఒక్క మగాడికి కూడా పశువులాగ ఆడపిల్లల మీద పడి అ(హ)త్యాచారం చేయాలనే ఆలోచన మనస్సులోకి కూడా రానేరాదు కదా!

నాన్న గారి మాట

చిత్రం

ప్రకృతా...వికృతా

చిత్రం
ప్రకృతా....వికృతా?! వీణ్ణి చూసి వీడి దేహాన్ని చూసి వీడి బతుకును చూసి వాడు జాలిపడ్డాడు... వీణ్ణి ఎలాగైనా బాగుచేయాలని వాడు తీర్మానించుకున్నాడు... పథకం ప్రకారం మత్తు పెట్టి వీడి వెన్నెముక విరిచాడు... వీడి ఎముకల్లోని మూలుగు వాడు కమ్మగా జుర్రుకున్నాడు, వీడికి ఉత్త ఎముక లిచ్చి ప్రేమగా తిను అన్నాడు, వీడి మనసు సోలయింది, మానికయింది, వీడి అభిమానం “బ్యానర్’ అయింది, గుడ్డిగా భజన చేయటం “మానర్” అయింది, వాడికి వీడు ఇపు డొక చెప్పు, వాణ్ణి జాగ్రత్తగా మోసే పల్లకీ, వాణ్ని కాపాడే ఒక బుల్లెట్ ప్రూఫ్ కోటు, ఈ లోగా వీడికి ఎపుడో ఓ నాడు.. ఆ మత్తు దిగిపోయింది, చూస్తే?! కూలి పోతున్న తన ఎముకల గూడు కాలిపోతున్న తన ఆశల గోడు ఆక్రమించబడిన నడిచే త్రోవ కబ్జా చేయబడిన కాలిక్రింది నేల గాలిని దోచారు, నీటిని దాచారు.! ఎన్నో సునామీలు, చరిత్రలో ఎన్నో తిరుగుబాట్లు, అకస్మాత్తుగా సంచలనాలు తప్పవు. ఆపాలనుకొన్నా ప్రభంజనాలు ఆగవు. వికృతి వేసుకున్న ప్రకృతి వేషం వెలిసిపోతుంది, వికృతిలో ముంచబడిన ప్రకృతిమూర్తి బయటపడుతుంది! ~ అడుసుమల్లి రవి కుమార్

ఒక్క క్షణం

చిత్రం
క్షణం..జీవిత వీక్షణం! పూలవనాన ఒక మల్లె మొగ్గను వాన చినుకు స్పర్శకు పులకింపజేస్తుంది ఓ క్షణం... ఒడిలిపోయిన మరో పూవును అదే చినుకు రాలిపోయేలా చేస్తుంది అదే క్షణం! నూతన వధూవరుల కొత్త జీవితపు ఆశలను హారముగా కూర్చి మెడలో వేస్తుంది ఓ క్షణం.. కలిసి బ్రతకటాన్ని కలగా మార్చి జంటలను విడగొడుతుంది అదే క్షణం! కొత్త పిచ్చోడిని పసి పరువాన ప్రేమ వ్యసనానికి బానిసగా చేస్తుంది ఓ క్షణం... ద్వేషంతోనో, వికారంతోనో ప్రేమికుడిని ఉన్మాదిగా మారుస్తుంది అదే క్షణం! ముష్కరులను మట్టికరిపిస్తూ,దేశ రక్షణలో మరణించిన సైనికుడిని వీరునిగా చేస్తుంది ఓ క్షణం.. జాతి విద్రోహ వ్యాఖ్యలతో అహంకరించే వాడికి కుక్క చావునిస్తుంది అదే క్షణం! ఆనందం బాధగా, బాధ ఆనందం గా మారడానికి పట్టే సమయం క్షణమే.. క్షణభంగురమైనది మానవ జీవితం ఎగుడు దిగుడులూ క్షణ పరిమితాలే! ~ అడుసుమల్లి రవి కుమార్

నాన్న

చిత్రం
చిటికెన వ్రేలును దిక్సూచి గా మార్చి,భుజస్కందాన్ని భద్ర సింహాసనంగా చేస్తాడు. సాన్నిహిత్యాన్ని సాహిత్య సమ్మేళనంగా తీర్చి, అనుభవసారాన్ని గీతా సారంగా బోధిస్తాడు. పలుకులకు జ్ఞాన వాచకమై నడవడికి నీతి శతకమై, ఈప్సితాలకు కల్పతరువై, లక్ష్య సాధనకు నిత్య శ్రామికుడౌతాడు. ఆచరణకు తాను ధార్మికుడై నిలుస్తాడు. కుటుంబానికి దాన కర్ణుడిలా మారిపోతాడు. అవసరాలలో శిబి చక్రవర్తి గా అనిపిస్తాడు. అనురాగాన్ని అమృతంగా పంచుతాడు. కష్టాలకు కొవ్వొత్తిలా కలుగుతారు, పిల్లల భవిష్యత్తును బ్రహ్మలా లిఖిస్తాడు. సవాళ్ళను సైనికుడిలా ఎదిరిస్తాడు, కుటుంబాన్ని రామచంద్రుడిలా పాలిస్తాడు. హృదయాన్ని కోవెలగా మారుస్తాడు, మమతల దివ్వెను వెలిగిస్తాడు. వరాలిచ్చే దేవుడే ఈర్ష్య పడేలా, ఇల్లు అనే ఆలయానికి ధ్వజస్తంభం లా నిలుస్తాడు.  ఆయనెవరో కాదు *నాన్నే!* ........................................... ~ అడుసుమల్లి రవి కుమార్

నువ్వు...నవ్వు

చిత్రం
నువ్వెప్పుడూ ఒంటరివే  కానీ, నీ నవ్వెప్పుడూ సమూహానిది  కావాలి.

నాన్న కు నివాళులు

చిత్రం
తాను కరిగిపోతూ వెలుగునిచ్చే కొవ్వొత్తి లా తాను నలిగిపోతూ కుటుంబాన్ని మోసిన గొప్ప వ్యక్తి మా నాన్న... మా అందరి చిరునవ్వుల్లో ప్రతిబింబిస్తూ, మాకు ఎప్పటికీ తీరని భావోద్వేగం మా నాన్న. నిర్యాణం: విజయ నామ సంవత్సరం(2013), చైత్ర బహుళ త్రయోదశి. వారి స్మరణ లో నివాళులు తెలుపుతూ కుటుంబ సభ్యులు.

కాలం

చిత్రం
కాలం అంటే గడియారం ముళ్లు కాదు గుండెలో నిండిన స్మృతుల శృతి - లయ! అనుభవాల క్షణాలు మనసు పొరల్లో జ్ఞాపకాలైపోతాయి. ఒక చిరునవ్వో, ఒక కన్నీటి చుక్కో కొలమానమై కాలం లోతుల్ని అన్వేషిస్తుంది. ఒక దీపం ఆరిపోవచ్చు అది పంచిన వెలుతురు జ్ఞానం శాశ్వతం. ఒక శరీరం నశించిపోవచ్చు అది ప్రసవించిన ప్రాణం పరంపరగా కొనసాగుతుంది. కాలచక్రం నిన్నటి అశుభాల పీఠిక కారాదు రేపటి ఆశల మణిదీపం కావాలి! కాలం మరణించవచ్చు, కాలాన్ని శ్వాసించిన అక్షరం అమరమౌతుంది...! ~ అడుసుమల్లి రవి కుమార్

లక్ష్యం

చిత్రం
ఏదైనా ఒక లక్ష్యం ఏర్పరుచుకోనంతవరకూ నీ ప్రాధాన్యతలేమిటో నీకు తెలియవు. అప్పటిదాకా నీకు ఇష్టమైనవి తప్ప, అవసరమైన పనులు చెయ్యవు.

ఆశ... అవకాశం

చిత్రం
ఎవరికంటేనో గొప్పగా ఉండాలనుకునే ఆశ కంటే, గతం లో కంటే ఇప్పుడు బావుంటే చాలనుకునే సంతృప్తి ముఖ్యం. ఎందుకంటే ఆశ పుట్టినంత తొందరగా  అవకాశం పుట్టదు.! ~ అ.ర.కు

స్థితి

చిత్రం
*నీవొచ్చిన స్థితి నీకు గుర్తులేకుంటే నీకొచ్చిన స్థితిలో నువ్వు నిలదొక్కుకోలేవ్!   నీ స్థితిని బట్టి ఎగిరెగిరి పడితే స్థిరత్వం తో పాటు ఆదరణా కోల్పోతావ్! ~ *అ.ర.కు*

నేను ఉపాధ్యాయుడిని

ఇందధ్రనస్సు వంగినపుడు చూపుల దారాలతో ఊయలలు కట్టేస్తా మేఘాలు పరుగెడుతున్నప్పుడు కొంగల బారువై వెంటాడి ఒడిసిపట్టేస్తా పిల్లలందర్నీ చుక్కలుగా మార్చి నేను చందమామనై నవ్వులు చిందిస్తా వాననీటి ఒరవడిలో కాగితపు పడవ మీద సాహసయాత్రకు బయల్దేరతా పేదరాశి పెద్దమ్మ ఆశీర్వాదాలు అందుకొని, ఒంటికన్ను రాక్షసుణ్ని సంహరించేందుకు ఖడ్గధారినై అడవిలోకి దౌడుతీసేస్తా పాఠమైనా, కథయినా  పిల్లలకు అద్భుతాలు చెప్పేందుకు సంకోచించను నన్ను కథానాయకునిగా ఊహించుకొనేట్టు కథచెప్పి వాళ్లను నా అనుచరులుగా మార్చుకోనండోయ్ ఎవడికి వాడు రాకుమారుడై కత్తిదూసి గుఱ్ఱమెక్కేట్టు చూస్తా పత్రి పిల్లవాడు ఓ సాహస వీరుడిగా అద్భుతాల పప్రంచపు పొగమంచు దృశ్యాల్లోకి దూసుకుపోయేట్టు చూస్తా..! అర్థమైందిగా నేనెవరో... నేను ఉపాధ్యాయుడిని. 🎉ఉపాధ్యాయులకు అంకితం🙏 ~ అడుసుమల్లి రవి కుమార్

అంచనా

చిత్రం
మనల్ని మనం ఎక్కువ అంచనా వేసుకోవడం ఎంత ప్రమాదమో, తక్కువ అంచనా వేసుకుంటే కూడా అంతే ప్రమాదం.  అంచనా ఎక్కువైతే చేసే పనిపైన ధ్యాస తక్కువుంటుంది. క్వాలిటీ లాస్. అంచనా తక్కువైతే ఫలితం పైన ధ్యాస ఎక్కువుంటుంది. ప్రొడక్టివిటీ లాస్. కాబట్టి మనపై అంచనాలు వేసే ఆలోచన మానేసి, పంజూస్కోడమే! 𖣔శుభరాత్రి𖣔

ప్రకృతికి ప్రణమిల్లుదాం

చిత్రం
గలగల పారే సెలయేర్లు మిలమిల మెరిసే తారకలు అందమైన పూదోటలు హాయిగొలిపే పిల్లగాలి తెమ్మెరలు ఎగసిపడే కడలి కెరటాలు కురిసే నీలిమేఘాలు కోయిల పాటల వసంతాలు మట్టి వాసనల వర్షాలు కొండల్లోంచి దూకే జలపాతాలు కోనల్లో కొలువైన అందాలు,అద్భుతాలు మన కోసం ప్రకృతి ప్రసాదించిన వరాలు. ప్రకృతి కి ప్రణమిల్లి, తన ఒడిలో సేదదీరుదాం. ~ అడుసుమల్లి రవి కుమార్

నీవు పాతదే కానీ...

ఓ చీకటి, వేదననే నింపనీ ఓ రోజు, కన్నీటినే మిగల్చనీ గాయాలే కానీ బలహీనతలే వెక్కిరించనీ.. ఆగేది కాదు నీ పయనం. అన్నీ సంతోషాలే అయితే, మనసు లోతు ఎలా పెరిగేది?! మనిషి రీతి ఎలా తెలిసేది?! మళ్ళీ రాదు, గడిచిన క్షణం వృధా చెయ్యక దూసుకుపో, నిన్ను నువ్వు తరుముకుంటూ,  మెరుగు పెట్టుకుంటూ నీదైన ఓ బాట వేసుకుంటూ  ఓడినా, నీవైన ముద్రలు వేస్తూ సాగిపో బాధపడుతూనో, భయపడుతూనో కూర్చోడానికి సమయం ఉండడం ఒక లగ్జరీ. మనమంత లగ్జరీ కాదు కదా!? నీవు పాతదే, కానీ రేపటి రోజు కొత్తది. ❣︎❤︎ శుభరాత్రి❤︎❣︎ ~ అడుసుమల్లి రవి కుమార్

రక్షించే చెట్టు

చిత్రం
రక్షించే చెట్టు.. మన తాతలనాటి పుట్టుక కలది. మన మనుమల బారసాలల దాకా  బతుకనిద్దాం. గాలి అలల్లో ప్రాణ ధాతువును నింపేది భూమి అరల్లో జల ధారలు పొదిగేది ఎండ వేడిలో నీడల్ని పరిచేది మన తరాలను చూసిన చెట్టును నరకడం మనకి మనం ఉరి వేసుకోవడమే. వసతి నిచ్చే చెట్టు ఉనికికి ఎసరు పెట్టకండి. దారుల వెడల్పు సరే, మీ మనసులెప్పుడు వెడల్పు చేసుకుంటారు?! చెట్టు కొమ్మల్లో ఒదిగిన పక్షుల్ని  పాడనివ్వండి, పొదగనివ్వండి. కాకులు, పిచ్చుకలను మన పిల్లలు, వాళ్ళ పిల్లలు చూడాలా,వద్దా? ఎవరి అండా లేకుండానే  మనకు అండగా నిలబడిన గొప్ప యోధ. వేళ్ళు పెకలించి, వేడుక చేస్తారా? మీరు చేసే మొక్కల వారోత్సవాలు కంటితుడుపు చర్యలేగా! పుడమి తల్లి వేదన తీరుస్తాయా!? నాయనలారా  ‘ఆకుపచ్చ’ అంతం  మన ‘ఆఖరి శ్వాస’కు ఆరంభం. వృక్షో రక్షతి రక్షితః 🌱🌿☘️🍀🍃🪴🌵🌴🌳🌲🏞️ ❣︎శుభరాత్రి❣︎ ~ అడుసుమల్లి రవి కుమార్

నువ్వు కావాలి ప్రభూ

చిత్రం
ఇంకా ఎన్నడుగులు, ఎన్ని మలుపులు ఏది మొదలు, ఏది చివర? అదే ఎందుకు? ఎదలోని ప్రపంచాన్ని, ఎదుట హాలాహలాన్ని ఇంకా ఎన్నాళ్ళు వేలి కొసలతో ఆపడం?! ప్రభూ..నువ్వున్నావో, లేవో తెలిసే అవకాశం లేదు. నా వరకూ మాత్రం నువ్వు కావాలి. నువ్వు లేకున్నా! ~ అ.ర.కు

నాన్న గారి మాట

చిత్రం

అంతేనంటారా

చిత్రం

ఐదు సంపదలు

పది మందికి - సహాయపడాలి అంటే ఎంత డబ్భు అవసరం? మనలో ప్రతి ఒక్కరం ఇతరుల కష్టాలకు చలిస్తాం. కానీ పై విధంగా ఆలోచిస్తాం. మీరు ఇతరులతో పంచుకోగల ఐదు సంపదలను కలిగివున్నారని మీకు తెలుసా!? మొదటిది.. మీ ముఖం  మీరు ఇతరులతో నవ్వును పంచుకోవచ్చు.ఇది ఉచితం.ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది.   రెండవది మీ కళ్ళు మీరు ప్రేమ మరియు శ్రద్ధతో  ఇతరులను చూడవచ్చు. మూడవది మీ నోరు ఈ నోటితో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు.మంచిని చర్చించి, సత్సంగములో చేర్పించి, సానుకూలతను వ్యాప్తి చెందించగలరు. నాలుగవది మీ హృదయం మీ దయగల హృదయంతో, భగవంతున్ని ప్రార్థిస్తూ మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు.ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు.వారి హృదయాలను తాకవచ్చు. మీరు కలిగి ఉన్న ఐదవ సంపద మీ శరీరం ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు.అవసరమైన వారికి చేతనైన సహాయం చేయవచ్చు. సహాయం  చెయ్యడానికి  ఒక చిన్న శ్రద్ధ, సంజ్ఞలు చాలు. అవి కొన్ని జీవితాలను వెలిగించగలవు. భగవంతుడు మనకిచ్చిన జీవితం సర్వోత్తమమైనది! ప్రతిక్షణం ఆనందంగా ఉంటూ, పదిమందికి చేతనైన సహాయం చేస్తూ, మన జన్మను చరితార్థం చేసుకోవడమే మన జన్...

మెదడునూ కడుగుదాం

చిత్రం
వెనకకు రానిది కాలమే కాదు  మాట కూడా మాట శాంతి సందేశాలనిస్తుంది అణ్వస్త్రాలకు అడుగులూ నేర్పుతుంది మాట పడటమంటే దెబ్బ మీద దెబ్బ మాటకు గొంతు తుపాకీ గొట్టం ట్రిగ్గర్‌ మాత్రం మెదడు హస్తగతం చేయి సైతం ఓ కీలుబొమ్మే కరచాలనంతో హృదయ పుష్పం విప్పారినా తలమీద చల్లని స్పర్శతో వెన్నెల జల్లులు కురిపించినా భుజం తట్టి బరువు దింపి జారిన ధైర్యాన్ని గుండెల్లోకి తెచ్చినా ఒకరి కోపానికి తాను పరికరమై సాటి మనిషిని తోసేసినా చొక్కా పట్టినా, చెంపను చరిచినా చేయిది సుశిక్షిత సైనిక పాత్రే ఇంద్రియాలన్నీ ఇంగిత జ్ఞానకోవిదులే మంచే చేయాలనుకుంటాయి మనిషి చేష్టలకు మదన పడతాయి. కానీ 'యజమాని' అజ్ఞాన కబోది! తన అసహనానికీ అవగుణానికీ వాటి నిగ్రహాన్ని కొల్లగొడుతున్నాడు. అందుకే మేని తో పాటు మెదడునూ "కడుగుదాం"! ~ అడుసుమల్లి రవి కుమార్

పితృ దేవతా స్తుతి

చిత్రం
సంక్రాంతికి పితృదేవతలకు సంబంధం ఉంది. సంక్రాంతి సందర్భంగా తప్పక చదవాల్సిన, వినాల్సిన పితృ దేవతా స్తుతి.  శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇది ’గరుడ మహాపురాణం’లో చెప్పబడుతున్నది. ఇందులో అన్ని పితృగణాలు, వాటి విశేష రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. దేవతల చేత కూడా ఆరాధింపబడే మహిమాన్వితులు పితృదేవతలు. వారి అనుగ్రహం వలన వంశవృద్ధి, ఐశ్వర్య క్షేమాలు సమకూరుతాయి. నమస్యేహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదైవతమ్! దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేయు స్వధోత్తరైః!! నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః! శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తి మభీప్సుభిః!! నమస్యేహం పితౄన్ సర్గే సిధాః సంతర్పయన్తియాన్! శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః!! నమస్యేహం పితౄన్ భక్త్యా యోర్చ్యన్తే గుహ్యకైర్దివి! తన్మయత్వేన వాంఛద్భి యుద్ధిమాత్యన్తికీం పరామ్!! నమస్యేహం పితౄన్ మర్త్యై రర్చ్యన్తే భువియే సదా! శ్...

నాన్న గారి మాట

చిత్రం