ఒక్క క్షణం
క్షణం..జీవిత వీక్షణం!
పూలవనాన ఒక మల్లె మొగ్గను
వాన చినుకు స్పర్శకు పులకింపజేస్తుంది ఓ క్షణం...
ఒడిలిపోయిన మరో పూవును
అదే చినుకు రాలిపోయేలా చేస్తుంది అదే క్షణం!
నూతన వధూవరుల కొత్త జీవితపు ఆశలను హారముగా కూర్చి మెడలో వేస్తుంది ఓ క్షణం..
కలిసి బ్రతకటాన్ని కలగా మార్చి జంటలను విడగొడుతుంది అదే క్షణం!
కొత్త పిచ్చోడిని పసి పరువాన ప్రేమ వ్యసనానికి బానిసగా చేస్తుంది ఓ క్షణం...
ద్వేషంతోనో, వికారంతోనో ప్రేమికుడిని ఉన్మాదిగా మారుస్తుంది అదే క్షణం!
ముష్కరులను మట్టికరిపిస్తూ,దేశ రక్షణలో మరణించిన సైనికుడిని వీరునిగా చేస్తుంది ఓ క్షణం..
జాతి విద్రోహ వ్యాఖ్యలతో అహంకరించే వాడికి కుక్క చావునిస్తుంది అదే క్షణం!
ఆనందం బాధగా, బాధ ఆనందం గా మారడానికి పట్టే సమయం క్షణమే..
క్షణభంగురమైనది మానవ జీవితం
ఎగుడు దిగుడులూ క్షణ పరిమితాలే!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి