నాది నాదే...నీది కూడా నాదే అనే స్వార్థ ప్రపంచంలో … నాది నీదైనప్పుడు నిజంగా నేను మనిషినవుతానని చెప్పగల త్యాగనిరతి ఎప్పటికో..!? చీకటి రేయిన నక్షత్రాలు మెరిసినట్లు పంజరం నుంచి పక్షి స్వేచ్ఛగా ఎగిరినట్లు పసి పిల్లల నిస్వార్ధపు నవ్వు కలిసినట్లు చిమ్మ చీకటిని పౌర్ణమి వెలిగినట్లు అలలు తీరం చేరే సమయానికి వాటి పరుగుల్లో వుండే నురుగులంత ,అందమైన మనస్సు తో మంచు కొండల మధ్య తపస్సు చేసే మునీంద్రుల పుణ్యమై మానవత్వం గుభాళించేది ఎనాడో..!? ఆనాడు మన మోముల్లో అమృతం లో మునిగి తేలి వెలుగుతునట్టు ఎంత తేజస్సో! ఈ విశాల విశ్వమందలి గ్రహాలన్నీ మనలో లీనమైనట్టు ఎంత దైవత్వమో! నాకు నచ్చని 'నా' ని పుచ్చుకొని నడువలేని నా జీవితానికి ఇంతకు మించిన ఆశ లేదు మరి!! ~ అడుసుమల్లి రవి కుమార్
అశాశ్వతమైన నా జీవితానికి నీ ప్రేమ శాశ్వత ధన్యత! కాలం నిర్ధాక్షిణ్యానికి ., విధి విలాసానికి మధ్య విలవిల్లాడే నా హృదయానికి నీ ప్రేమే ఔషధం! నువ్వంటే .., ఒట్టి దేహమని కాదు మనసని అసలే కాదు. కోట్ల అసంబంధీకుల మధ్య .., నాకు సొంతమైన అలౌకిక అస్థిత్వం!
మనిషి జీవితానికి ప్రయాణం కావాలి కాలమనే వాహనం కావాలి చైతన్యమనే స్పందన కావాలి మజిలీలలో అనుభవాలు దాచుకొనే మనస్సు కావాలి….. ఈ ప్రయాణం నీ ఒక్కడిది కాదు నీ ఒక్కడికోసం క...
జీవితం పరుపు బండ మీద పరుగులుపెట్టే బండి చక్రం కాదు అట్లని కంకర రాళ్ళ గతుకుల రోడ్డు మీద నడిచే నగ్న పాదాల నడకా కాదు అడుగు అడుగిక్కీ మధ్య వ్యత్యాసాలు కొన్ని హ్రస్వాల...
ఈరోజు నిన్నటి ప్రతి బింబం కాదు రేపటి రోజుకు ఇవ్వాల్టి రూపం వుండక పోవచ్చు నిన్నటి కంటే రేపు సుధీర్ఘ మయిందీ కావచ్చు గతం గురించీ పోగొట్టుకున్న దాని గురించే మాట్లాడ...
ప్రపంచం ఇంతే.నీకోసం ఏదీ మారదు,దాని సకల బలాలతో,బలహీనతలతో,సుగంధ దుర్గంధాలతో,ఆనంద విచారాలతో,కలిసి ముందుకు పోగలగడమే జీవితనైపుణ్యం.అదే సాంఘిక మనుగడ సూత్రం.నాశనమే కానీ ...
నాజ్ఞాపకం నీ మదిలో మెదిలినపుడు నీ పెదాలపై నవ్వు మెరవాలి . నేననే ఊహ నిన్ను కదిపినపుడు నీ జీవితం తేలికవ్వాలి . నా మాటొకటి నీ చెవుల్లో మెదిలినపుడు నీ భుజంపై నా చెయ్యి స...
ఆధ్యాత్మికత.....నాస్తికత చిరకాలంగా మనిషిలో జరుగుతున్న "అంతరాన్వేషణ" అవసరం మనిషికి నిజంగా ఉందా? ఆ అన్వేషణ ప్రతి జీవితం విధిగా జరపాల్సిందేనా? నాస్తికులు, హేతువాదులనబడ...