ఎప్పటికో
నాది నాదే...నీది కూడా నాదే
అనే స్వార్థ ప్రపంచంలో …
నాది నీదైనప్పుడు
నిజంగా నేను మనిషినవుతానని
చెప్పగల త్యాగనిరతి ఎప్పటికో..!?
చీకటి రేయిన నక్షత్రాలు మెరిసినట్లు
పంజరం నుంచి పక్షి స్వేచ్ఛగా ఎగిరినట్లు
పసి పిల్లల నిస్వార్ధపు నవ్వు కలిసినట్లు
చిమ్మ చీకటిని పౌర్ణమి వెలిగినట్లు
అలలు తీరం చేరే సమయానికి
వాటి పరుగుల్లో వుండే నురుగులంత ,అందమైన మనస్సు తో
మంచు కొండల మధ్య
తపస్సు చేసే మునీంద్రుల పుణ్యమై
మానవత్వం గుభాళించేది ఎనాడో..!?
ఆనాడు
మన మోముల్లో
అమృతం లో మునిగి తేలి వెలుగుతునట్టు
ఎంత తేజస్సో!
ఈ విశాల విశ్వమందలి గ్రహాలన్నీ మనలో లీనమైనట్టు ఎంత దైవత్వమో!
నాకు నచ్చని 'నా' ని పుచ్చుకొని నడువలేని నా జీవితానికి ఇంతకు మించిన ఆశ లేదు మరి!!
~ అడుసుమల్లి రవి కుమార్
అనే స్వార్థ ప్రపంచంలో …
నాది నీదైనప్పుడు
నిజంగా నేను మనిషినవుతానని
చెప్పగల త్యాగనిరతి ఎప్పటికో..!?
చీకటి రేయిన నక్షత్రాలు మెరిసినట్లు
పంజరం నుంచి పక్షి స్వేచ్ఛగా ఎగిరినట్లు
పసి పిల్లల నిస్వార్ధపు నవ్వు కలిసినట్లు
చిమ్మ చీకటిని పౌర్ణమి వెలిగినట్లు
అలలు తీరం చేరే సమయానికి
వాటి పరుగుల్లో వుండే నురుగులంత ,అందమైన మనస్సు తో
మంచు కొండల మధ్య
తపస్సు చేసే మునీంద్రుల పుణ్యమై
మానవత్వం గుభాళించేది ఎనాడో..!?
ఆనాడు
మన మోముల్లో
అమృతం లో మునిగి తేలి వెలుగుతునట్టు
ఎంత తేజస్సో!
ఈ విశాల విశ్వమందలి గ్రహాలన్నీ మనలో లీనమైనట్టు ఎంత దైవత్వమో!
నాకు నచ్చని 'నా' ని పుచ్చుకొని నడువలేని నా జీవితానికి ఇంతకు మించిన ఆశ లేదు మరి!!
~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి