పోస్ట్‌లు

2016లోని పోస్ట్‌లను చూపుతోంది

నేనే

అప్పుడప్పుడు.. నాకు నేనే పరిమళాన్ని అప్పుడప్పుడు నాకు నేనే కాంతి శిఖరాన్ని అప్పుడప్పుడు నాకు నేనే చిరునవ్వుల జడిని అప్పుడప్పుడు నాకు నేనే వెన్నంటే ధైర్యాన్ని అప్పుడప్పుడు నాకు నేనే ఎదురొచ్చే ఆత్మస్థైర్యాన్ని ఎందుకంటే ఎప్పటికప్పుడు నాతో నేనే గడిపే తొలినేస్తాన్ని నాలో నేనే ఒదిగే ఒక శిల్పాన్ని నా గమ్యానికి నేనే పరచుకునే కృషి తరమైన మార్గాన్ని నా లక్ష్యానికి నన్నే చేరవేసే సుదీర్ఘ  స్ఫూర్తినీ నాలో నేనే జ్వలించే జాగృత దేదీప్యాన్ని

కోతికొమ్మచ్చి

కోతికొమ్మచ్చి!. లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం పెగ్-1 మందు విషయంలో మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ వంట చేస్తూంటుంది. వంటింట్లోంచి పాత్రల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. మనం పిల్లిలా ఇంట్లో దూరుతాం. చెక్కబీరువాలోంచి మందు బాటిల్ తీస్తాం. ఫొటోలో తాతగారు నవ్వుతూ చూస్తారు. ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం. ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం. ఎవరూ వాడని బాత్రూం అటక మీంచి గ్లాసందుకుంటాం. లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం. గ్లాసు కడిగేసి అటక మీద పెట్టేస్తాం. తాతగారు బోసినవ్వుతో చూస్తారు. వంటింట్లోకి తొంగి చూస్తాను. మా ఆవిడ చపాతీపిండి కలుపుతూంటుంది. ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం. ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం. మా ఆవిడకూ నాకూ మధ్య సంభాషణ మొదలవుతుంది. నేను: శర్మగారమ్మాయి పెళ్లి సంగతేమైంది? మా ఆవిడ: తిన్నగా ఉంటే కదా, మంచి సంబంధాలు రావడానికి! పెగ్-2 మనం మళ్లీ ఇవతలికి వస్తాం. చెక్కబీరువా తలుపు చప్పుడు చేస్తుంది. మనం మాత్రం నిశ్శబ్దంగా బాటిల్ తీస్తాం. లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం. బాటిల్ కడిగేసి అట...

అంతరంగం

ఇంత రంగము -- అంతరంగము ఉరకలు పరుగులు ఉరకలు పరుగులు ఊపిరి సలపని పని నలు చెరుగులు తారా గ్రహములు తిరుగు ఖగోళము నా మనసయ్యది గందర గోళము జీవిత మార్జన కే యంకితమా జీవితాని కార్జన యంకితమా ఎంత కాలమీ తలమునకల పని ఎంత త్రవ్వినా తరగనిదీ గని పెరిగిన తదుపరి ఏమౌతావని యడిగిన తెలిపితి తెలియదని ఇప్పుడు నాకనిపిస్తూవున్నది ‘తరగని పెన్నిధి బాల్యమన్నది’ టక్కరిగాళ్ళగు మిత్రులు వున్నా వారియందు గల టెక్కులు సున్నా పది కాసులు నా దగ్గర వుంటే ఈగల గుంపులు బెల్లము చుట్టే జేబులు ఖాళీ అయినాయంటే తెలియును నా వారెవరో కంటే నాన్న పెత్తనము ఉండే వరకు మిగిలిన కోరిక లేవీ  చివరకు పగ్గము చేతులకంద వెంటనే నిరతము కారెను నీరు కంటనే అవసర మాదాయమును మించగా కోరికలే కొడి గట్టి పోయెగా అడుగుతారు బాగున్నారా యని తలనూపెదనే దానికి ఔనని నిజమును చెప్పే ధైర్యము లేదు పెదవులపై దరహాసము రాదు విధి మాయ కదా ఈ విపరీతము విస్తుపోక వేరేమిటి చేతము జీవుడున్నచో నీట మునుగుదుము వదలి వేయుచో పైకి తెలెదము మాయామయమీ మాధవ లీలలు తెలియ లేములే దేవుని హేలలు ఆలోచన లో మునిగిపోవగా గతుకుల దారుల గదిని చేరగా గురువుల గాంచితినాశ్చర్యముగా ఒక...

నీకు తెలుసా

నీకు తెలియదు కదూ! . వెచ్చని దుప్పట్లోంచి లేవంగానే పేపర్రాలేదని విసుక్కుంటావు కానీ పేపరేసే కుర్రాడికి రాత్రంతా జ్వరమున్నా పొద్దున్నే చల్లో లేచాడని తెలియదు కదూ.... . పాల పేకెట్ నీ కాఫీ టైంకి అందట్లేదని చిందులేస్తావు కానీ పాలు పంచే కుర్రాడికి అన్నంలో మజ్జిగ నీళ్ళు కరువని నీకు తెలియదు కదూ.... . ఎంత డబ్బు పోసినా బాత్రూం టైల్స్ మెరవట్లేదని చిర్రు బుర్రులాడతావు కానీ నువు ఖరాబు చేసిన కమోడ్ కడిగే అమ్మాయి తెల్లవారుఝామున ఆరుబయట చీకటిలో పడే అవస్థ తెలియదు కదూ... . నీ డ్రైనేజీ బ్లాక్ అయితే పూడిక తీసే చేతులు రెండుపూట్లా నోట్లోకెళ్తాయో లేదో కూడా నీకు తెలియదు కదూ... . మానవత్వం అంటే ఎక్కడో దూరంగా ఉన్న సిరియా శరణార్ధుల మీదో నేపాల్ భూకంప బాధితుల మేదో ఇజ్రాయిల్ సైన్యం హతమార్చే పాలస్థీనుల మీదో చూపించే జాలేనా..........? . రెండు పూటలా ఒళ్ళు శుభ్రం చేస్కున్నా మనసులోని కుళ్ళు కడగాలంటే ముప్పైమునకలేసినా పుష్కర గోదారికి మాత్రం సాధ్యమా?????????

ఆనందం

మూసి ఉన్న మదితలుపును జ్ఞాపకాల మునివేళ్ళతో నెట్టగానే... నీ రూపం కనిపించి క్షణం లో అస్పష్టం అయ్యింది బహుశా నా కళ్ళకు ఆనందం ..అల్లరితో.. కన్నీటి గంతలు కట్టినట్లుంది 🌹💐🌹💐🌹💐🌹

పరిక్షేపనం

కంటి చెలమను దాటిన కన్నీటి బిందువు చెక్కిలి దాటలోపే నీ ప్రేమ జ్వాలా కిరణంతో పరిక్షేపనం చెంది.. నీ రాకను నా హృదయానికి మధురంగా...చేర్చింది