పోస్ట్‌లు

నవంబర్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

గతి తప్పిన గాడిద కొడకా

గతి తప్పిన గాడిద కొడకా.. పురుష పుట్టుక పరమార్ధమెరుగరా?! మనం మన బ్రతుకు, ఛీ.. కాంక్రీటు అడవిలో బ్రతుకుతున్న యంత్రాలం మనం  సెకను ముల్లుతో సాగిపోయే భ్రమరాలం మనం  విద్యను మార్కులతో కొలిచే బుద్ధిలేని జీవులం మనం  నేర్చిన విద్యతో వికారాలు పోయే వికృతులం మనం ప్రేమకు కొలమానాలు వెతికే తూకపు రాళ్ళం మనం  స్వార్థమే సరియని నిస్వార్థంగా నమ్మీ ఏకాకిగా బ్రతికే అనేకులం మనం మానవత్వం అర్థాన్ని గూగుల్లో వెతికే మానవులం మనం  సంఘంలో బ్రతుకుతున్న ఒంటరులం మనం మనిషితనానికి దూరమౌతున్న అమానుషులం మనం  బూతు చిత్రాల టెక్నాలజీని ఆడదాని పై అత్యాచారంగా మార్చే మృగాళ్ళం మనం  విలువలు వలువలూడదీసే సంస్కృతిని సినిమాలుగా చూసే ప్రేక్షకులం మనం.. మనం...మనం...మనం..😢 వర్ధమాన భారతమా ! స్త్రీలపై  వేల అత్యాచారాలు, వందల హత్యలతో దినదినము వర్ధిల్లు... పురుష పుట్టుక పొందినందుకు సిగ్గుతో,అవమానంతో...అత్యాచార బాధిత మృతులకు శోకతప్త నయనాంజలి😓 ~ అడుసుమల్లి రవి కుమార్

సాహసం కావాలి

ఆశయాల చిటారు కొమ్మన వెలిగే కాంతి పుష్పం స్వప్నం సత్యం చేయడానికి సాహసం కావాలి పరచుకున్న అనేకానేక మరణాల్ని నిలబెట్టి ఒక జీవితం చెయ్యడానికి సాహసం కావాలి సంశయ సముద్ర కల్లోలం లో నమ్మకాల నౌక భగ్నమైనప్పుడు కడ దాకా ఈదే రెక్కల సాహసం కావాలి ఒకటొకటే రాలిపడే నక్షత్రాల్ని చూసి ఒంటరి ఆకాశం చీకటైనప్పుడు ఒక ఉదయంగా వెలగడానికి సాహసం కావాలి అదృశ్య ఖడ్గప్రహారాల మధ్య అజేయంగా నిలవడమే జీవితమైనప్పుడు గాయాల్ని గౌరవించడానికి సాహసం కావాలి

నాన్న

పాదాలు ముందుకు కాదు వెనక్కు కదులుతున్నాయి బాల్యం ఒక జ్ఞాపకం....! కళ్లను దారి వెంట పరచిన క్షణాలు ఇంకా అలానే ఉన్నాయి ఎక్కడో ఒక శబ్దం.... అన్నీ అయిపోయినట్టే ఉంటుంది అప్పుడే మొదలైనట్టూ ఉంటుంది పదే పదే కలవరించినా ఎవ్వరూ రారు అదేపనిగా కళ్లు తడిచిపోతున్నా తుడిచే చేతులు లేవు అప్పుడు నాన్న ఒక కథానాయకుడు నడిచే నాటకం... కదిలే పద్యం నాడు నా వేలు పట్టుకుని నడిపించిన నాన్న నేడు వేరే వేషం వేసుకున్నాడు వెలుగుతున్న దీపం రెపరెపలు ఆకాశంలో మెరుపుల విరుపులు నాన్న ఒక ఉద్వేగం... నాన్న ఒక బాధ్యత కాలం చాలా క్రూరమైంది ఏ క్షణాన్నీ కుదురుగా ఉండనివ్వదు అనుభవాలనన్నింటినీ జ్ఞాపకాలను చేసి జీవితాన్ని ఒంటరితనంలోకి నెట్టేస్తుంది ఇంతకు ముందు నాన్నను ఇంట్లోనో, ఊళ్లోనో వెతుక్కునే వాన్ని ఇప్పుడు శ్మశానంలో వెతుకుతున్నా అక్కడక్కడా పడ్డ ఎముకల్లో వెతుక్కుంటున్నా చితిలో కాలిపోయింది నాన్న దేహం కాదు అక్కడ మిగిలిపోయింది నాన్న ఎముకలు కావు అవి అనుభవాలు.. అవి జ్ఞాపకాలు..... ఇప్పుడు నాన్నలేడు... నాన్నే ఒక జ్ఞాపకమై ప్రతి క్షణం అక్షరాలవుతున్నాడు అంతా అయిపోయినట్టే ఉంటుంది మళ్లీ అప్పుడే మొదలైనట్టూ ఉంటుంది.....!!!

ప్రయత్నం

జీవిత ప్రయాణం లో ఎన్నో ప్రయత్నాలు చేసి విజయం దక్కక మరో ప్రయత్నానికి సిద్ధమవుతున్న వాళ్ళందరికీ అంకితం....... అపుడపుడూ నా కళ్ళు నన్నే వింతగా చూస్తున్నాయ్.. అపుడపుడు నా మాటలు నన్నే ప్రశ్నిస్తూ ఉన్నాయ్.. అపుడపుడూ నా గుండె చప్పుడు నన్నే భయపెడుతోంది.. ఇపుడు నా చేతులు పిడికిలి విసరాలని నాకే నేర్పిస్తున్నాయ్. ఇపుడు నా కాళ్ళు నన్ను ముందుకురకమనే ప్రోత్సహిస్తున్నాయ్.. నిదానంగా అర్థమవుతోంది ..నాలో అంతర్యుద్ధం ప్రారంభమవుతోందనీ... కానీ మనసెపుడూ కర్తవ్యవిముఖుడైన కిరీటే.. జీవితపుకురుక్షేత్రం లో గీతోపదేశం కోసం ఎదురుచూపే.. క్రమంగా అవగతమవుతోంది.. ఏ గీతా మన తలరాతను మార్చలేదనీ మనుగడకోసం జరిగే పోరాటం లో మన ప్రయత్నమే మన విజయానికి నాంది అనీ.. అడుసుమల్లి రవి కుమార్

బ్రతుకాట

బ్రతుకాట..బ్రతుకట...బ్రతుకుట!! కనుచూపు మేర ఎడారే కనబడినా ఆశల చెలమలకై వెతికే పయనం... బ్రతుకాట ప్రతీ మలుపులోనూ ఇన్నాళ్ళూ ఇది నాకు తెలియదే అనుకుంటూ చేసే ప్రయాణమిది. బ్రతుకాట కోల్పోయినవేంటో గెలుచుకున్నవేమిటో అసలు పద్దు తేల్చేది నువ్వూ నేనూ కాదు. కాలం. బ్రతుకాట మోస్తున్న బరువెంతో నాకే తెలియదు...దింపుకున్న క్షణం వరకు. బ్రతుకాట మంచి అనిపించుకోడానికి ఎన్నో ఓర్చుకోవడం చివరికొచ్చేసరికి మంచి అనిపించుకున్నా, లేకపోయినా ఒరిగేదేమీ ఉండదని తెలుసుకోవడం. బ్రతుకాట మనిషిని మనిషి ప్రేమించాలి అన్న సూక్తి పాతబడింది. మనిషిని మనిషి భరించడమే ఇక. బ్రతుకాట వాక్యానికి చివర ఉండే చుక్కలాగ రోజు చిట్టచివర  మిగిలుంటుంది ఆశ.. చుక్క లేని వాక్యం అసంపూర్ణమట కదా.. బ్రతుకాట గమనం రేపటికి చేరుస్తున్నా జ్ఞాపకం నిన్నలలోకి విసిరేస్తుంది ఎన్నో  సంఘర్షణలకు తావిచ్చి నన్ను ఒంటిగా మిగులుస్తుంది. బ్రతుకాట ~ అడుసుమల్లి రవి కుమార్

నా మాతృభాష తెలుగు

ఆంగ్లేయులు అధికారంలో ఉండగా తెలుగును ఎప్పుడూ తక్కువగ చూడలేదు. బడులలో నేర్పారు. అణాలపై ముద్రించారు ఎక్కువ మంది, చాల ఎక్కువ ప్రాంతంలో మాట్లాడే భాషగా గుర్తించారు. CP బ్రౌన్ లాంటి వారు ఎన్నో తెలుగు కావ్యాలను మనకే పరిచయం చేశారు.  మనం మాత్రం ఆంగ్లం మీద అపరిమితమైన మోజు పెంచుకున్నాము. విచిత్రం, ఇప్పటికీ Rain Rain go away లాంటి పద్యాలు నేర్పుతున్నాం ఎంత అసహజమైన విద్య, ఎంత అర్థ రహిత, నీతి లేని చప్పని చదువులు గురించి, వ్యవసాయాధారిత సంస్కృతికి ఎంత వ్యతిరేకంగా ఉన్నదో చెప్పాల్సిన పని లేదు.  కోట్ల మంది పిల్లలు దేశంలో "వానా వానా వెళ్లి పో" అని అనడం వింతగా  లేదూ 😢😢 *ఒక సంగీతము వోలె విన్పించు భాష* అని విశ్వనాధ వారు ఊరకనే అనలేదు కదా.. మాతృభాషలో చదువుకుంటున్నపుడు, మెదడులోని, నియోకోర్టేక్స్ విశేషంగా  స్పందిస్తుంది. ఫలితంగా చిన్నారుల్లో సూక్ష్మబుద్ధి, కొత్త ఆలోచనలను వ్యక్తీకరించగల సామర్ధ్యం చాలా వేగంగా వృద్ధి చెందుతాయి : Dr. Asok Pangaria, former president,  Indian academy of neurology. మాతృ భాషని మరిచిపోయిన సమాజం సృజనాత్మతకు సుదూరంగా ఉండి  పోతుంది, వారు సిస్సందేహంగా వారి సమాజం...

విలువలు

చిత్రం
నాని