నా మాతృభాష తెలుగు
ఆంగ్లేయులు అధికారంలో ఉండగా తెలుగును ఎప్పుడూ తక్కువగ చూడలేదు. బడులలో నేర్పారు. అణాలపై ముద్రించారు ఎక్కువ మంది, చాల ఎక్కువ ప్రాంతంలో మాట్లాడే భాషగా గుర్తించారు. CP బ్రౌన్ లాంటి వారు ఎన్నో తెలుగు కావ్యాలను మనకే పరిచయం చేశారు. మనం మాత్రం ఆంగ్లం మీద అపరిమితమైన మోజు పెంచుకున్నాము.
విచిత్రం, ఇప్పటికీ Rain Rain go away లాంటి పద్యాలు నేర్పుతున్నాం ఎంత అసహజమైన విద్య, ఎంత అర్థ రహిత, నీతి లేని చప్పని చదువులు గురించి, వ్యవసాయాధారిత సంస్కృతికి ఎంత వ్యతిరేకంగా ఉన్నదో చెప్పాల్సిన పని లేదు. కోట్ల మంది పిల్లలు దేశంలో "వానా వానా వెళ్లి పో" అని అనడం వింతగా
లేదూ 😢😢
*ఒక సంగీతము వోలె విన్పించు భాష* అని విశ్వనాధ వారు ఊరకనే అనలేదు కదా..
మాతృభాషలో చదువుకుంటున్నపుడు, మెదడులోని, నియోకోర్టేక్స్ విశేషంగా
స్పందిస్తుంది. ఫలితంగా చిన్నారుల్లో సూక్ష్మబుద్ధి, కొత్త ఆలోచనలను వ్యక్తీకరించగల సామర్ధ్యం చాలా వేగంగా వృద్ధి చెందుతాయి : Dr. Asok Pangaria, former president,
Indian academy of neurology.
మాతృ భాషని మరిచిపోయిన సమాజం సృజనాత్మతకు సుదూరంగా ఉండి
పోతుంది, వారు సిస్సందేహంగా వారి సమాజం చేతనే కాదు, ఎవరి చేతా కూడా గౌరవింపబడరు - అబ్దుల్ కలాం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి