ప్రయత్నం
జీవిత ప్రయాణం లో ఎన్నో ప్రయత్నాలు చేసి విజయం దక్కక మరో ప్రయత్నానికి సిద్ధమవుతున్న వాళ్ళందరికీ అంకితం.......
అపుడపుడూ నా కళ్ళు నన్నే వింతగా చూస్తున్నాయ్..
అపుడపుడు నా మాటలు నన్నే ప్రశ్నిస్తూ ఉన్నాయ్..
అపుడపుడూ నా గుండె చప్పుడు నన్నే భయపెడుతోంది..
ఇపుడు నా చేతులు పిడికిలి విసరాలని నాకే నేర్పిస్తున్నాయ్.
ఇపుడు నా కాళ్ళు నన్ను ముందుకురకమనే ప్రోత్సహిస్తున్నాయ్..
నిదానంగా అర్థమవుతోంది ..నాలో అంతర్యుద్ధం ప్రారంభమవుతోందనీ...
కానీ
మనసెపుడూ కర్తవ్యవిముఖుడైన కిరీటే..
జీవితపుకురుక్షేత్రం లో గీతోపదేశం కోసం ఎదురుచూపే..
క్రమంగా అవగతమవుతోంది..
ఏ గీతా మన తలరాతను మార్చలేదనీ
మనుగడకోసం జరిగే పోరాటం లో మన ప్రయత్నమే మన విజయానికి నాంది అనీ..
అడుసుమల్లి రవి కుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి