గతి తప్పిన గాడిద కొడకా

గతి తప్పిన గాడిద కొడకా..
పురుష పుట్టుక పరమార్ధమెరుగరా?!

మనం మన బ్రతుకు, ఛీ..

కాంక్రీటు అడవిలో బ్రతుకుతున్న యంత్రాలం మనం 
సెకను ముల్లుతో సాగిపోయే భ్రమరాలం మనం 
విద్యను మార్కులతో కొలిచే బుద్ధిలేని జీవులం మనం 
నేర్చిన విద్యతో వికారాలు పోయే వికృతులం మనం
ప్రేమకు కొలమానాలు వెతికే తూకపు రాళ్ళం మనం 
స్వార్థమే సరియని నిస్వార్థంగా నమ్మీ ఏకాకిగా బ్రతికే అనేకులం మనం మానవత్వం అర్థాన్ని గూగుల్లో వెతికే మానవులం మనం 
సంఘంలో బ్రతుకుతున్న ఒంటరులం మనం మనిషితనానికి దూరమౌతున్న అమానుషులం మనం 
బూతు చిత్రాల టెక్నాలజీని ఆడదాని పై అత్యాచారంగా మార్చే మృగాళ్ళం మనం 
విలువలు వలువలూడదీసే సంస్కృతిని సినిమాలుగా చూసే ప్రేక్షకులం మనం..

మనం...మనం...మనం..😢

వర్ధమాన భారతమా ! స్త్రీలపై  వేల అత్యాచారాలు, వందల హత్యలతో దినదినము వర్ధిల్లు...

పురుష పుట్టుక పొందినందుకు సిగ్గుతో,అవమానంతో...అత్యాచార బాధిత మృతులకు శోకతప్త నయనాంజలి😓

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం