మా నాన్నే మా హీరో
On behalf of my DAD's birth anniversary 💕 ఎదలోతుల్లో అంతులేని బాధలెన్ని ఉన్నా మమతల పచ్చని తివాచీని కప్పి, మది పొరల కదిలికలు తెలియనివ్వక, మా కలలను సాకారం చేసిన సూపర్ మ్యాన్ మా నాన్నే.. నడి సంద్రంలో మునిగే మా నావను ఒడ్డుకు చేర్చిన ధైర్యం మా నాన్నే.. ఎడారిలో తడారిన మా గొంతులకు దాహం తీర్చిన ఒయాసిస్సు మా నాన్నే.. మండుటెండల తాపంలో నీడలా వెంట నడిచిన చల్లని మేఘం మా నాన్నే.. ఓటమి అంచున నేనుంటే, విజయం దిశగా పరుగెత్తించిన గొప్ప గురువు మా నాన్నే.. తప్పటడుగులు వెస్తున్నా, ఆటుపోట్లు ఎదురైనా నా భుజం తట్టి ధైర్యం చెప్పిన గొప్ప స్నేహితుడు మా నాన్నే.. నిస్సత్తువతో నేనున్నా, అనారోగ్యంతో బాధ పడుతున్నా, నా బాధలన్నిటికీ గొప్ప మందు మా నాన్నే.. ఎప్పటికీ 𝗠𝘆 𝗗𝗮𝗱 𝗶𝘀 𝗠𝘆 𝗛𝗲𝗿𝗼 ~ అడుసుమల్లి రవి కుమార్