పోస్ట్‌లు

మార్చి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆశ... అవకాశం

చిత్రం
ఎవరికంటేనో గొప్పగా ఉండాలనుకునే ఆశ కంటే, గతం లో కంటే ఇప్పుడు బావుంటే చాలనుకునే సంతృప్తి ముఖ్యం. ఎందుకంటే ఆశ పుట్టినంత తొందరగా  అవకాశం పుట్టదు.! ~ అ.ర.కు

స్థితి

చిత్రం
*నీవొచ్చిన స్థితి నీకు గుర్తులేకుంటే నీకొచ్చిన స్థితిలో నువ్వు నిలదొక్కుకోలేవ్!   నీ స్థితిని బట్టి ఎగిరెగిరి పడితే స్థిరత్వం తో పాటు ఆదరణా కోల్పోతావ్! ~ *అ.ర.కు*

నేను ఉపాధ్యాయుడిని

ఇందధ్రనస్సు వంగినపుడు చూపుల దారాలతో ఊయలలు కట్టేస్తా మేఘాలు పరుగెడుతున్నప్పుడు కొంగల బారువై వెంటాడి ఒడిసిపట్టేస్తా పిల్లలందర్నీ చుక్కలుగా మార్చి నేను చందమామనై నవ్వులు చిందిస్తా వాననీటి ఒరవడిలో కాగితపు పడవ మీద సాహసయాత్రకు బయల్దేరతా పేదరాశి పెద్దమ్మ ఆశీర్వాదాలు అందుకొని, ఒంటికన్ను రాక్షసుణ్ని సంహరించేందుకు ఖడ్గధారినై అడవిలోకి దౌడుతీసేస్తా పాఠమైనా, కథయినా  పిల్లలకు అద్భుతాలు చెప్పేందుకు సంకోచించను నన్ను కథానాయకునిగా ఊహించుకొనేట్టు కథచెప్పి వాళ్లను నా అనుచరులుగా మార్చుకోనండోయ్ ఎవడికి వాడు రాకుమారుడై కత్తిదూసి గుఱ్ఱమెక్కేట్టు చూస్తా పత్రి పిల్లవాడు ఓ సాహస వీరుడిగా అద్భుతాల పప్రంచపు పొగమంచు దృశ్యాల్లోకి దూసుకుపోయేట్టు చూస్తా..! అర్థమైందిగా నేనెవరో... నేను ఉపాధ్యాయుడిని. 🎉ఉపాధ్యాయులకు అంకితం🙏 ~ అడుసుమల్లి రవి కుమార్

అంచనా

చిత్రం
మనల్ని మనం ఎక్కువ అంచనా వేసుకోవడం ఎంత ప్రమాదమో, తక్కువ అంచనా వేసుకుంటే కూడా అంతే ప్రమాదం.  అంచనా ఎక్కువైతే చేసే పనిపైన ధ్యాస తక్కువుంటుంది. క్వాలిటీ లాస్. అంచనా తక్కువైతే ఫలితం పైన ధ్యాస ఎక్కువుంటుంది. ప్రొడక్టివిటీ లాస్. కాబట్టి మనపై అంచనాలు వేసే ఆలోచన మానేసి, పంజూస్కోడమే! 𖣔శుభరాత్రి𖣔

ప్రకృతికి ప్రణమిల్లుదాం

చిత్రం
గలగల పారే సెలయేర్లు మిలమిల మెరిసే తారకలు అందమైన పూదోటలు హాయిగొలిపే పిల్లగాలి తెమ్మెరలు ఎగసిపడే కడలి కెరటాలు కురిసే నీలిమేఘాలు కోయిల పాటల వసంతాలు మట్టి వాసనల వర్షాలు కొండల్లోంచి దూకే జలపాతాలు కోనల్లో కొలువైన అందాలు,అద్భుతాలు మన కోసం ప్రకృతి ప్రసాదించిన వరాలు. ప్రకృతి కి ప్రణమిల్లి, తన ఒడిలో సేదదీరుదాం. ~ అడుసుమల్లి రవి కుమార్

నీవు పాతదే కానీ...

ఓ చీకటి, వేదననే నింపనీ ఓ రోజు, కన్నీటినే మిగల్చనీ గాయాలే కానీ బలహీనతలే వెక్కిరించనీ.. ఆగేది కాదు నీ పయనం. అన్నీ సంతోషాలే అయితే, మనసు లోతు ఎలా పెరిగేది?! మనిషి రీతి ఎలా తెలిసేది?! మళ్ళీ రాదు, గడిచిన క్షణం వృధా చెయ్యక దూసుకుపో, నిన్ను నువ్వు తరుముకుంటూ,  మెరుగు పెట్టుకుంటూ నీదైన ఓ బాట వేసుకుంటూ  ఓడినా, నీవైన ముద్రలు వేస్తూ సాగిపో బాధపడుతూనో, భయపడుతూనో కూర్చోడానికి సమయం ఉండడం ఒక లగ్జరీ. మనమంత లగ్జరీ కాదు కదా!? నీవు పాతదే, కానీ రేపటి రోజు కొత్తది. ❣︎❤︎ శుభరాత్రి❤︎❣︎ ~ అడుసుమల్లి రవి కుమార్

రక్షించే చెట్టు

చిత్రం
రక్షించే చెట్టు.. మన తాతలనాటి పుట్టుక కలది. మన మనుమల బారసాలల దాకా  బతుకనిద్దాం. గాలి అలల్లో ప్రాణ ధాతువును నింపేది భూమి అరల్లో జల ధారలు పొదిగేది ఎండ వేడిలో నీడల్ని పరిచేది మన తరాలను చూసిన చెట్టును నరకడం మనకి మనం ఉరి వేసుకోవడమే. వసతి నిచ్చే చెట్టు ఉనికికి ఎసరు పెట్టకండి. దారుల వెడల్పు సరే, మీ మనసులెప్పుడు వెడల్పు చేసుకుంటారు?! చెట్టు కొమ్మల్లో ఒదిగిన పక్షుల్ని  పాడనివ్వండి, పొదగనివ్వండి. కాకులు, పిచ్చుకలను మన పిల్లలు, వాళ్ళ పిల్లలు చూడాలా,వద్దా? ఎవరి అండా లేకుండానే  మనకు అండగా నిలబడిన గొప్ప యోధ. వేళ్ళు పెకలించి, వేడుక చేస్తారా? మీరు చేసే మొక్కల వారోత్సవాలు కంటితుడుపు చర్యలేగా! పుడమి తల్లి వేదన తీరుస్తాయా!? నాయనలారా  ‘ఆకుపచ్చ’ అంతం  మన ‘ఆఖరి శ్వాస’కు ఆరంభం. వృక్షో రక్షతి రక్షితః 🌱🌿☘️🍀🍃🪴🌵🌴🌳🌲🏞️ ❣︎శుభరాత్రి❣︎ ~ అడుసుమల్లి రవి కుమార్