నీవు పాతదే కానీ...

ఓ చీకటి, వేదననే నింపనీ
ఓ రోజు, కన్నీటినే మిగల్చనీ
గాయాలే కానీ
బలహీనతలే వెక్కిరించనీ..
ఆగేది కాదు నీ పయనం.
అన్నీ సంతోషాలే అయితే,
మనసు లోతు ఎలా పెరిగేది?!
మనిషి రీతి ఎలా తెలిసేది?!

మళ్ళీ రాదు, గడిచిన క్షణం
వృధా చెయ్యక దూసుకుపో,
నిన్ను నువ్వు తరుముకుంటూ, 
మెరుగు పెట్టుకుంటూ
నీదైన ఓ బాట వేసుకుంటూ 
ఓడినా, నీవైన ముద్రలు వేస్తూ సాగిపో

బాధపడుతూనో, భయపడుతూనో
కూర్చోడానికి సమయం ఉండడం ఒక లగ్జరీ.
మనమంత లగ్జరీ కాదు కదా!?
నీవు పాతదే, కానీ రేపటి రోజు కొత్తది.

❣︎❤︎ శుభరాత్రి❤︎❣︎

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం