నేను ఉపాధ్యాయుడిని

ఇందధ్రనస్సు వంగినపుడు
చూపుల దారాలతో ఊయలలు కట్టేస్తా

మేఘాలు పరుగెడుతున్నప్పుడు
కొంగల బారువై వెంటాడి ఒడిసిపట్టేస్తా

పిల్లలందర్నీ చుక్కలుగా మార్చి
నేను చందమామనై నవ్వులు చిందిస్తా

వాననీటి ఒరవడిలో
కాగితపు పడవ మీద సాహసయాత్రకు బయల్దేరతా

పేదరాశి పెద్దమ్మ ఆశీర్వాదాలు అందుకొని,
ఒంటికన్ను రాక్షసుణ్ని సంహరించేందుకు
ఖడ్గధారినై అడవిలోకి దౌడుతీసేస్తా

పాఠమైనా, కథయినా 
పిల్లలకు అద్భుతాలు చెప్పేందుకు సంకోచించను

నన్ను కథానాయకునిగా ఊహించుకొనేట్టు కథచెప్పి
వాళ్లను నా అనుచరులుగా మార్చుకోనండోయ్

ఎవడికి వాడు రాకుమారుడై
కత్తిదూసి గుఱ్ఱమెక్కేట్టు చూస్తా

పత్రి పిల్లవాడు ఓ సాహస వీరుడిగా
అద్భుతాల పప్రంచపు పొగమంచు దృశ్యాల్లోకి
దూసుకుపోయేట్టు చూస్తా..!

అర్థమైందిగా నేనెవరో... నేను ఉపాధ్యాయుడిని.

🎉ఉపాధ్యాయులకు అంకితం🙏

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం