రక్షించే చెట్టు
రక్షించే చెట్టు..
మన తాతలనాటి పుట్టుక కలది.
మన మనుమల బారసాలల దాకా
బతుకనిద్దాం.
గాలి అలల్లో ప్రాణ ధాతువును నింపేది
భూమి అరల్లో జల ధారలు పొదిగేది
ఎండ వేడిలో నీడల్ని పరిచేది
మన తరాలను చూసిన చెట్టును నరకడం
మనకి మనం ఉరి వేసుకోవడమే.
వసతి నిచ్చే చెట్టు ఉనికికి ఎసరు పెట్టకండి.
దారుల వెడల్పు సరే, మీ మనసులెప్పుడు వెడల్పు చేసుకుంటారు?!
చెట్టు కొమ్మల్లో ఒదిగిన పక్షుల్ని
పాడనివ్వండి, పొదగనివ్వండి.
కాకులు, పిచ్చుకలను మన పిల్లలు,
వాళ్ళ పిల్లలు చూడాలా,వద్దా?
ఎవరి అండా లేకుండానే
మనకు అండగా నిలబడిన గొప్ప యోధ.
వేళ్ళు పెకలించి, వేడుక చేస్తారా?
మీరు చేసే మొక్కల వారోత్సవాలు
కంటితుడుపు చర్యలేగా!
పుడమి తల్లి వేదన తీరుస్తాయా!?
నాయనలారా
‘ఆకుపచ్చ’ అంతం
మన ‘ఆఖరి శ్వాస’కు ఆరంభం.
వృక్షో రక్షతి రక్షితః
🌱🌿☘️🍀🍃🪴🌵🌴🌳🌲🏞️
❣︎శుభరాత్రి❣︎
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి