ప్రకృతికి ప్రణమిల్లుదాం

గలగల పారే సెలయేర్లు
మిలమిల మెరిసే తారకలు
అందమైన పూదోటలు
హాయిగొలిపే పిల్లగాలి తెమ్మెరలు
ఎగసిపడే కడలి కెరటాలు
కురిసే నీలిమేఘాలు
కోయిల పాటల వసంతాలు
మట్టి వాసనల వర్షాలు
కొండల్లోంచి దూకే జలపాతాలు
కోనల్లో కొలువైన అందాలు,అద్భుతాలు
మన కోసం ప్రకృతి ప్రసాదించిన వరాలు.
ప్రకృతి కి ప్రణమిల్లి, తన ఒడిలో సేదదీరుదాం.

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం