పోస్ట్‌లు

2020లోని పోస్ట్‌లను చూపుతోంది

తండ్రీ శివయ్యా

చిత్రం
తండ్రీ శివయ్యా... మీరు నా వెనకా ఉన్నారు, నా ముందూ ఉన్నారు, నా ప్రక్కనా ఉన్నారు, నాతో ఉన్నారు,నాలోనే ఉన్నారు! సకల పాపహరా, సర్వేశ్వరా పాహిమాం దేవాధిదేవా, రక్షమాం సర్వజన పోషకా.. మీ పేరు తలచి, ప్రకృతి పులకించింది! చిగురుటాకుల  కొమ్మ కూడా ప్రణవం లా మారింది! 🕉️ ఓం నమః శివాయ 🔱 ~ అడుసుమల్లి రవి కుమార్ ۞ 𝐆𝐨𝐨𝐝 𝐞𝐯𝐞𝐧𝐢𝐧𝐠 ۞

ఎర్రని కాంతి

చిత్రం
జీవిత యుద్ధ సన్నాహం ఎప్పటికీ ముగిసిపోనిది, మరణం వరకూ. మన లోపల దాక్కున్న నిజమైన మనతో ధైర్యంగా బయటకు రాలేని దౌర్భాగ్యపు బ్రతుకులు మనవి, యుద్ధం అనివార్యం. జీవితం యొక్క అసలైన ప్రయోజనం జీవించడం.  కానీ మనం ఇది తప్ప అన్నీ చేస్తాం, మన అస్తిత్వాన్ని అన్వేషణ చేయాలన్నది వాస్తవం. జీవితపు విలువను, మనిషి మనసును, లోకం తీరును నిర్దాక్షిణ్యంగా చూపించే కొన్ని క్షణాలుంటాయి, సంఘర్షణ ప్రత్యక్షం. ఉషోదయాన కనిపించే ఈ ఎర్రటి కాంతి, ఏడ్చి ఎర్రబడిన కళ్ళదైతే కావొచ్చు, కానీ అది రగిలే ఉత్సాహానికి సంకేతమయ్యేట్టుగా..ప్రతీ ఉదయం క్రొత్తగా నాలుగు కాలాల పాటు గుర్తుండేలా రాసుకోండి.! ~ అడుసుమల్లి రవి కుమార్ ꧁శుభోదయం꧂

నాన్నా...

చిత్రం
నాన్న.... నను సాకిన నీ చేతులెంత  కందెనో   నను మోసిన నీ భుజములు ఎంత క్రుంగెనో  నన్ను నిద్రపుచ్చిన నీ గుండె ఎంత బెదిరినో  నన్ను దాచుకు పెంచిన నీ కళ్ళలో నీరెంత నిండెనో  నీకు తలవంపులు రానీను నా తలంపులలో నీవు ఉన్నంత వరకు నాన్న! ❀ శుభరాత్రి ❀ ~ అడుసుమల్లి రవి కుమార్

మా నాన్నే నా హీరో

చిత్రం
❣️మా నాన్నే నా హీరో💕 ప్రియమైన నాన్న.... నా అడుగులు ఇప్పుడు అంతులేని దూరాలు దాటినా అవి మొదటగా నడిచింది నీ గుండెల పైనే! కష్టాలెన్నో నీ మీద కురుక్షేత్రం చేసినా అరిచేతితో అవి నా వరకు రాకుండా ఆపావు. నీవు పేద గా బ్రతికినా నన్ను రాకుమారుడి లా నీ చేతుల్లో మలిచావు! నేను నీ ఉనికిని మాత్రమే కాదు నాన్న, నీవు కంచెగా కాస్తే మానుగ మారిన మొక్కని! ~ అడుసుమల్లి రవికుమార్ 𑁍శుభరాత్రి𑁍

అంతరాత్మ తో పోరాడకు

చిత్రం
అడ్డదారుల్లో అందలం ఎక్కాలని  ఆరాటపడకు.. అంతరాత్మను నిత్యం అణచివేసే పోరాటమదని తెలుసుకో..! 𖣔శుభోదయం𖣔 ~ అ.ర.కు

మంటలు

చిత్రం
మంటలు.. మంటలు.. మంటలు మనిషిని దహించే మంటలు మనిషి పోయాక కాల్చేస్తాయి దేహన్ని చితి మంటలు! ఉన్నపుడేమో  దహించి వేస్తాయి  గుండెను  ఈర్ష్య,అసూయలనే మంటలు! చితి మంటలు చచ్చిన వారినే బూడిద చేస్తాయి. ఈర్ష్యాసూయల మంటలు మానవత్వాన్నీ బూడిద చేసేస్తాయి! ꧁శుభరాత్రి꧂ ~ అడుసుమల్లి రవికుమార్

పువ్వల్లే వెళ్ళిపోవాలి

చిత్రం
కలకాలం ఉండలేము అని తెలిసినా, ఉన్న ఆ కొన్ని రోజులూ  "అద్భుతంగా"  జీవిస్తాయి పువ్వులు! అందుకే మహానుభావులను(మా నాన్న గారు) పువ్వల్లే వెళ్ళిపోయాడంటారు! ✨శుభ రాత్రి 🌱

☀️Good morning ☀️

చిత్రం
వస్తువును "నాణ్యత"తో తయారు చేయడం మాత్రమే కాదు..ఎలా అమ్ముకోవాలో తెలియాలి. నువ్వెంత టాలెంటెడ్ ఐనా నిన్ను నువ్వు ప్రపంచానికి పరిచయం చేసుకోక పోతే అమ్ముడుపోలేవు ఆశించిన ధరకు. కొన్నిసార్లు నాణ్యతలేని వస్తువులుకూడా అమ్ముడుపోతాయి "పబ్లిసిటీ"తో..!!

లైట్ అండ్ షాడో

చిత్రం
లైట్ అండ్ షాడో ల మధ్య ఏర్పడిన అద్భుతమైన వారధే జీవితం... అది ఎలా ఉంటుందంటే మంచి సంగీతాన్ని అందించే పియానో లాగా! ꧁శుభరాత్రి꧂ ~ అడుసుమల్లి రవికుమార్

నిండావు ప్రాణంగా

కనులకు కాటుక అద్ది, కనుసైగ చేసావు చాటుగా.. నుదుటన సింధూరం దిద్ది, నా జీవితంలోకి వచ్చావు ఆశలు రేపగా... మనసుకు తలపులు రుద్ది, నా చెంత చేరావు తోడు-నీడ గా.. గుండెకు ఊపిరులూది, మారావు నా శ్వాసగా.. జీవిత మధురిమ పెరిగే కొద్దీ నిండావు నా అణువణువులో ప్రాణంగా..! ~ అడుసుమల్లి రవికుమార్

గుండె చప్పుడు

నీ ఆలోచనలో నేనే ఉండగా  నా ఆలోచనలో నీవే నిండావుగా  నా కనులలో వెలుగే నీవుగా  నీ శ్వాసలో ఊపిరి నేనుగా  ఒకరికొకరం  ఒక్కరిగా ఇద్దరం  చప్పుడు..కాదు అది మన గుండె చప్పుడు!

నీతో నువ్వు...నాతో నేను

⁂శుభోదయం⁂ నీతో నువ్వు... నాతో నేను తేల్చుకుందామా!? కాసేపు మనల్ని మనం చూసుకుందాం ఒక్కసారి ముసుగులన్నీ విప్పి 'నగ్నంగా' నిలబడదాం మనతో మనమే మాట్లాడుకుందాం మనలో మనమే తర్కించుకుందాం మనల్ని మనమే పోల్చుకునే ప్రయత్నం చేద్దాం నాకు కనిపించే నిన్నూ, నీకు కనిపించే నన్నూ తరిమి తరిమి కొడదాం నీకు మాత్రమే కనిపించే నిన్నూ, నాకు మాత్రమే కనిపించే నన్నూ ఎదురెదురుగా నిలబెడదాం నేనెవరని ప్రశ్నించుకుందాం, వచ్చే సమాధానాన్ని ధైర్యంగా విందాం పచ్చి నిజాన్ని తాగుదాం... గరళమో, అమృతమో అరాయించుకుందాం వెంట తిప్పుకుంటున్న నీడల్ని ఈరోజుకి కుక్కల బోనులో కట్టేద్దాం తాయెత్తులన్నీ పీకి సముద్రంలోకి విసిరేద్దాం నిప్పుని గుప్పెట్లో పట్టుకుని నిలుచుందాం తేల్చుకుందాం...చచ్చేలోగా నీతో నువ్వు, నాతో నేను!! ~ అడుసుమల్లి రవి కుమార్

కాలపు తునకలు

చిత్రం
సూర్యోదయం, సూర్యాస్తమయం చంద్ర కళలు, చుక్కల వెలుగులు మళ్ళీ మళ్ళీ జరిగే దృశ్యాదృశ్యాలు  వీచే గాలి.. మలయంగా స్పృశించనూ వచ్చు,ప్రచండమై పెకలించనూ వచ్చు! వర్షించే మేఘం.. జల్లులతో పాటు ఝల్లులనూ కురిపించవచ్చు! కాచే ఎండ..  నునువెచ్చదనమే కాక మేని మంటలనూ పుట్టించవచ్చు! ప్రతీ మార్పులోనూ ఓ అతిశయం ఉంది. త్రిపాత్రాభినయం చేసే కాలం  భూత,వర్తమాన, భవిష్యత్తు లుగా గమ్మత్తైన నాట్యంతో నర్తిస్తూనే వుంది! మార్పు కోరుతూ మనిషి కసిగా కాలం వెంట పరిగెడుతూనే ఉన్నాడు, పగ్గాలేసి పట్టుకోటానికి ప్రయత్నిస్తున్నాడు, అర్థం చేసుకోవాలని ఆరాట పడుతున్నాడు! మార్పు కావాలంటే గుండెలు బాదుకుంటే సరిపోదు, గతం గొ(తి)ప్పలు మరచి కొత్త బాటలో నడచి ప్రస్తుతాన్ని నిర్మిస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండక తప్పదు! మనిషి మహర్షిగా మారాలంటే, "కుళ్ళు"  పేరుకు పోకుండా ఎప్పటికప్పుడు కడగక తప్పదు. కాలపు తునకలను ఒడిసి పట్టక తప్పదు! ~ అడుసుమల్లి రవికుమార్

అనుభవం-నిర్ణయం

చిత్రం

"నేను"

చిత్రం
ఓ చిన్నా! నీవు రాసే కలం "నేను" నీవు రాసే భావాలకి కాగితం "నేను" నీ ఊహల ఉయ్యాలకి ఆధారం "నేను" నీ గుండెల్లో సృజనాత్మక సరాగాలకి శృతిని "నేను" ఎందుకంటే "నేను" నీ ఉపాధ్యాయుడను! ~ అడుసుమల్లి రవికుమార్

వింటున్నామా

చిత్రం
ప్రకృతి మనతో మాట్లాడుతున్నది. మరి మనం వింటున్నామా??!

నాన్న❤️

చిత్రం

నాకేమైంది

నాకేమైంది? అంతా నేనే అనుకుంటున్నాను, నన్ను నేను గుర్తించలేక పోతున్నాను! కాళ్ళకు గజ్జె కట్టుకునే ముందు కళ్ళకు అద్దుకోటం మరిచి పోతున్నాను! విద్యను ప్రదర్శించేముందు గురువు గార్ని గుర్తు చేసుకోలేక పోతున్నాను! ఆర్జన మాత్రమే చేస్తున్నాను అనుభూతిని విస్మరిస్తున్నాను! స్వయం శక్తి విలువ తెలియక సిఫార్సులకు తంటాలు పడుతున్నాను! ఎదుటివాడి మెప్పుకోసం వ్యక్తిత్వం తాకట్టు పెడుతున్నాను! విలువలేని వాడికి గులామునవుతున్నాను! గందరగోళం తాళంలో కంగాళీ చేస్తున్నాను! అమ్మో ఇప్పుడు ప్రవచనం వచ్చే వేళైంది, ఆలోచిస్తూ కూర్చుంటే అది మిస్సవుతుంది! అందుకనే ఆలోచించటం మానేస్తున్నాను, తలుపులు మూసి తలపుల్ని బయటకు గెంటేస్తున్నాను!

విఘ్నేశ్వరునికి విన్నపం

విఘ్నరాజుకో విన్నపం! మట్టిని ముట్టుకుంటే మరకంటుకుంటుందని ప్రగల్భాలు పలికే నాకు ఇప్పుడే తెలిసింది, మరక మట్టిలో లేదు,  మనసులో పేరుకు పోయిందని! జీవితాని కొకటే పండగ, కాళ్ళకింద తొక్కేస్తావేమని గడ్డి పరక గట్టిగా అరుస్తుంటే, అప్పుడు కనువిప్పైంది, పత్రికూడ పవిత్రతకోసం పరితపిస్తుందని! అక్షరాలు పిండిచేసి ఉండ్రాళ్ళు చేద్దామంటే నాకప్పుడు గుర్తొచ్చింది, కాంక్షలకు బందీనై ఆంక్షల సంకెళ్ళలో బిగిసుకున్నానని! చెల్లుబాటు కాదంటూ చిన్నచూపు చూడబోకు, లంబోదరా నీ దగ్గర  డంబాలెందుకు కాని, దండోరా వేసుకోలేని పరిస్ధితి నాది! మెండైన దేవరవని కొండత పత్రి తేలేను! చిత్తగించు స్వామీ, నా చిత్తాన్ని సమర్పిస్తాను! గుండెనిండా పీఠం వేస్తాను,  దండాలెట్టి ప్రార్థిస్తాను! తొందరగ వచ్చేయి స్వామీ,  గండాలన్నీ తొలిగించేయి! అండగ ఉంటానని అభయమీయి, నాకంతే చాలు! ఇంతేనయ్యా! నా చిన్న విన్నపం!

వినాయక చవితి

చిత్రం
ఆనందం, జ్ఞానం, ఐశ్వర్యం, బలం- ఈ నాలుగు తత్వాల ఈశ్వరత్వమే గణపతి స్వరూపం. ఆ స్వామి ఆరాధన వల్ల ఆ నాలుగూ లభిస్తాయని పురాణాలు, ఆగమాలు వివరిస్తున్నాయి. పృథ్వీవాసులందరికీ భూ తత్వమే ప్రధానం. యోగ, ఉపాసన తత్వాల పరంగా భూ రూపమైన పరమేశ్వర తత్వమే గణేశుడు. మిగిలిన నాలుగింటినీ కలబోసుకున్న అవనీ తత్వమూర్తిగా దైవాన్ని భావించడమే మట్టి గణపతి రూపంలోని ప్రత్యేకత. నాలుగు దిక్కుల వ్యాపకత్వమే ‘చతుర్భుజం విష్ణుం’. ఏ వర్ణమూ లేని ఆకాశ తత్వమే ‘శుక్లాంబరం ధరం’. శుద్ధ జ్ఞానమే ‘శశి వర్ణం’. ఆనందానుగ్రహ భావమే ‘ప్రసన్న వదనం’. ప్రకృతి పురుషుల ఏకతత్వమే పార్వతీ శంకరుల తనయుడిగా వ్యక్తమైంది. వేద, పురాణ, ఆగమ, కావ్య, సంగీత, నాట్య, శిల్ప, చిత్రకళ రూపాల్లో గణేశుడికి అత్యంత ప్రాధాన్యం ఉంది. తెలివితేటలకు, నాయకత్వ లక్షణాలకు గణేశుడు అధి దైవం. ఉపాసన శాస్త్రాల్లో బాల గణపతి నుంచి మహా గణపతి వరకు అనేక రూపాల్ని వర్ణించారు. దేవ, దానవ, మానవ, పశు, పక్షి, వృక్ష- ఇత్యాది భిన్నజీవుల గణాల్ని పరిపాలించే ఏక ఈశ్వర తత్వమే ‘గణపతి’ అని రుషుల తాత్పర్యం. గణపతి తత్వాన్ని ఆధారం చేసుకొని, అత్యంత విస్తారమైన సంప్రదాయం ఉంది. శైవ వైష్ణవ శాక్తేయాల్లాగే ‘గాణపత్య...

నీలా నువ్వుండు

చిత్రం

కష్టపడాలి

నీ ఉనికిని కోల్పోయాక నీ ఙ్ఞాపకం కూడా మరుగున పడిపోతుంది ఒక రోజుకు... ఇది  కదిలే కాలం... ఎవరి కోసం ఆగదు... ఎవరి నిష్క్రమణతో ఎవరి అస్తిత్వంతో  దానికి అవసరం లేదు. ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థాయికి ఎదగాలంటే‌...ఒళ్ళు వంచి కష్టపడాలి‌ కానీ పెన్ కొనుక్కుంటే చాలు అనుకుంటే ఎలా..

గెలుపు. ఆచారం. సంస్కృతి

గెలుపు:: నీ గెలుపు నీ కష్టం నుండి రావాలి పక్కవాడి నష్టం నుండి కాదురోయ్!! ఆచారం.. సంస్కృతి:: మనమేసుకునే దుస్తుల్లోనో,మన మాటల్లోనో కాదురోయ్ మన బుద్ధిలో,మన వ్యక్తిత్వం లో కనపడాలి. ~ అ.ర.కు

అమృతం

నిను తలచిన క్షణాలన్నీ నేనాస్వాదించే పరిమళాలైతే, నాలో దాగున్న నీ భావాలన్నీ కమనీయ కావ్యాలే! ఇన్నాళ్లు నను పెనవేసుకున్న ఈ మౌనాలు, ఒక్క నీ పిలుపుతో చెల్లాచెదురైనవి భలేగా! నీ కళ్ళల్లో పడి నా చూపులు పరిక్షేపణమైనవి ఆ కళ్ళల్లో ఏ గమ్మత్తులు దాచావో!? అనంతమైన ఆందోళనను దాచుకున్న ఈ గుండె, నీ నవ్వుల చప్పుడు వినబడక నిర్జీవమైపోదా కాలం కౌగిళ్లకు బందీలమవుతూ, జీవితపు మాధుర్యాన్ని మర్చిపోతున్నాం మనం!! మనిషిని హత్తుకునే ప్రేమ ఔషధమేమో మనసు ను హత్తుకునే ప్రేమ అమృతమే! ~ శుభరాత్రి అడుసుమల్లి రవికుమార్

నిద్ర

చిత్రం

ఏది కష్టం? ఏది సుఖం?

నీది కష్టమా సుఖమా? ఏది కష్టం? ఏది సుఖం? బాల్యపు గుర్తులు కంప్యూటర్ స్క్రీన్ పై రాయబడుతూ, యవ్వనపు ఉరకలు ఇంటర్నెట్ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి,జన్మ రహస్యాలు టెస్ట్ ట్యూబుల్లో నిక్షిప్తమై,ఫ్రీజర్లో మూలుగుతుంటే.. ఏది కష్టం? ఏది సుఖం? సౌకర్యాల వలలో పడి రసాయనాల విషాన్ని చిమ్ముతూ,సేవిస్తూ, ఆస్వాదిస్తూ.. తుమ్ముకు, దగ్గుకు, తలనొప్పికి, కాలునొప్పికి కూడా ఉలిక్కిపడుతుంటే.. ఏది కష్టం? ఏది సుఖం? కార్పొరేట్ ఉద్యోగాలతో బానిసలుగా బ్రతుకుతూ,  ప్లాస్టిక్ మొహాలతో సాటి వాడిని పలకరిస్తూ, డబ్బు డాంబికాల బడాయి కూతలే నాగరికమనుకుంటుంటే.. ఏది కష్టం? ఏది సుఖం? అంతా అయోమయంగా ఉందే!! ఇది సుఖం తోలు కప్పుకున్న కష్టమా లేక  మాయమవుతున్న మనిషితనమా..!? మిత్రమా, సమాధానం నువ్వే వెతుక్కో. ఇది కవితో కవనమో కాదు సుమా! అక్షరాలన్నీ జీవితాన్ని పెనవేసుకుంటే రాలి పడిన నా భావాలు..!! ~ అడుసుమల్లి రవికుమార్ ☄️శుభరాత్రి 🦋

పునరపి జననం పునరపి మరణం

ఇప్పుడే వచ్చా ఈ లోకానికి, ఇక్కడ నాకంతా కొత్తగా ఉంది! ఊపిరాడక ఉక్కిరిబిక్కిరౌతుంటే, ఉఛ్వాస, నిశ్వాసాలౌతానంది గాలి! చీకటిలో కన్నుగానక కకావికలమౌతుంటే , కనుపాపలో కాపురముంటానంది వెలుగు! ఆకలితో అలమటిస్తూ నకనకలాడి పోతూంటే, కాయలూ పండ్లూ రాల్చింది చెట్టు! దప్పికై నాలిక పిడచకడుతూంటే దబ్బున చిరుజల్లు కురిపించింది మబ్బు! మాటలు రాక తడబడుతుంటే, పాటలు పాడి నేర్పించింది కోయిల! అంతా బాగానే అనిపించింది, అలా కాలం గడిచి పోతూనే ఉంది! అందుకు ప్రత్యుపకారం చేయాలనిపించింది, అడిగాను ధీమాగా ఏం కావాలని! ముక్త కంఠంతో గాలి, వెలుగు, చెట్టు, మబ్బు, కోకిల అన్నీ నాకు చేసింది ఒకటే అభ్యర్ధన! తెలుసుకునే ఉంటావు దేవుడు ఎక్కడ ఉంటాడో, మర్మం మాకు కూడ చెప్పి పుణ్యం కట్టుకోమని! తల దించుకున్నాను నా అవివేకానికి, గుర్తొచ్చింది వచ్చిన పని మర్చిపోయానని! తప్పు నీదంటే నీదని యుద్ధానికి దిగాయి బుద్ధి,చిత్తాలు కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి, కళ్లు బైర్లు కమ్ముతున్నాయి,  చెవులు గింగురుమంటున్నాయి, నాలిక బయటకొచ్చేస్తోంది, చర్మం బిగుసుకు పోతోంది, కాలం గావు కేక వేసింది, కదిలి పోదాం వచ్చేయమని! అన్వేషణ అలాగే మిగిలి పోయింది! అప్పుడు నాకు జ్ఞానోద...

నేను నాలాగే

నాకు పరిచయమైన వారి మనసులో... నేను ఒక సామాన్య వ్యక్తిని నన్ను అర్థం చేసుకున్న వారి మనసులో... నేను ఒక అద్భుతమైన వ్యక్తిని నాపై అసూయపడే వారి మనసులో... నేను ఒక పొగరుబోతు వ్యక్తిని నన్ను మోసగించే వారి మనసులో... నేను ఒక అమాయక వ్యక్తిని నన్ను అపార్థం చేసుకున్న వారి మనసులో... నేను లోకంలోనే చెడ్డ వాడిని నన్ను ప్రేమించేవారికి మాత్రం నేనే ప్రపంచం. నా అభిప్రాయలు వెళ్లబుచ్చే సమయాన ఏకీభవించలేని మనసుకి నేను మొండివాడిని ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం. ఒక్కొక్కరి దృష్టికి నేను ఒక్కోలా కనపడతా! అందుకే... ఎవరి కోసమో నేను మారాలని లేదు. నన్ను నాలానే బ్రతకనివ్వమని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ~ అడుసుమల్లి రవికుమార్

విలువ

చిత్రం
🌿🌾శుభరాత్రి 🌾 🌱 పోయిందన్న బాధ, వచ్చిందన్న సంతోషం రెండూ అనవసరం! తుప్పు పట్టిన కత్తి, సిరా ఐపోయిన కలం, రెంటిలో.. ఒకదానికి వచ్చింది పోతే విలువ ఇంకొక దానికి పోయింది వస్తే విలువ!! ~ అడుసుమల్లి రవికుమార్

మెరుగు పడాలి

చిత్రం

యాప్ యాప్ ఉర్రే

చిత్రం
యాప్ యాప్ ఉర్రె..మనమిక గొర్రే!!! యాప్పులట... మనిషిలోని ఆర్ధ్రతని ఆవిరి చేసేవి కొన్ని అనుబంధాల తీపిని చప్పగా చేసేవి కొన్ని సృష్టించిన వాడినే ఆడుకునేవి కొన్ని మనిషి ని రోగిష్టి ని చేసి కుదించేవి కొన్ని డిజిటల్ లైఫ్ ని వండి వార్చి వడ్డించి  మనిషి తత్వాన్ని మర్డర్ చేస్తున్నాయి అన్నీ! మనిషిని కట్టు బానిసగా చేసి గుడిలో, బడిలో, మదిలో,పనిలో.. తమ సోదితో అప్ డేట్ చేస్తున్నాయి కదూ? అందరూ పరుగెత్తుతున్నారు ఎదురొచ్చినవాళ్ళను గుద్దుకుంటూ.. సహాయం, నీతి, నిజాయితీ, ప్రేమా, జాలీ, కరుణలు యాప్పుల కొలతలే..  ఇహ ఇప్పుడవి మనిషిని తొక్కేసి, ఎక్కేసి ఎగబాకి పోతున్నాయి అనంత విశ్వ "రహస్య"మంతా తమలో నింపుకుని,విశ్వాంతరపు ముఖంతో వున్న వాటికి దాసోహం కాని దెవరు!? ఏ ఒక్కర్నీ వదలకుండా అందర్నీ పరుగెత్తిస్తున్నాయవి. డిజిటల్ సంద్రంలో పడి యాప్లను మింగిన మనిషిని..దారి, దరి చేర్చేవి పుస్తకాలే! మనకు మన మూలాలు నేర్పే అసలైన యాప్ లు పుస్తకాలే!! ~ అడుసుమల్లి రవికుమార్

రంజాన్ శుభాకాంక్షలు

చిత్రం
నా బ్రతుకు మలుపులో తారసపడిన ప్రతి ముస్లిం మిత్రుడూ నాకో రంజాన్ చంద్రుడే! ఐదు గంటలకే అజాన్ అరుపు అమ్మ చేతి కంటే ముందు నా అంతరంగపు దుపట్టాను పట్టి లాగేది. అల్లా కూడా కూసింది లేరా అంటూ నాన్న మాటల్లోనూ అదే ఆర్ద్రతాగీతం. సిర్ప టోపీలు పెట్టుకున్న నా చిన్ననాటి ముస్లిం సోదరులంతా ఎర్ర దుబ్బ ఇసుకల్లో నమాజుకేసి సాగుతుంటే చుక్కలు పొడిచిన ఎన్ని ఆకాశాలో నేల మీద కదిలిపోతునట్టే ఉండేది.అత్తరు పరిమళాలు, అలాయిబలాయీల్లో ఆత్మీయతలు దేశంలోని జాతీయ సమైక్యతకు ప్రాణం పోస్తున్నట్లుండేవి. మసీదు గడియారం 'అల్లా'రంతోనే మా ఊరి దినచర్య మొదలయ్యేది. నా చలి ఉదయాల్ని టీ చుక్కలతో వెచ్చబరిచే హనీఫ్ భాయీ.. నొక్కుకుపోయిన నా సైకిలు బుగ్గలకు ప్రాణాలూదే రఫీమియా.. వచ్చీరాని ఉర్దూపదాలతో ఉబుసుపోని నా మాటల కబుర్లకు భాషా మధురిమల్ని పంచిపెడుతూ భాష్యం చెప్పే షకీల్ భాయీ.. వయసుకు చిన్నవాణ్ణయినా 'మామా' అంటూ ఆత్మీయ కంఠాన్ని ఒలకబోసే యూసుఫ్ అల్లుడూ.. కారు డ్రైవింగ్ లో నాకు ధైర్యాన్ని పంచిన పిడుగురాళ్ల జాని భాయీ.. ఏ ఒక్కరిలోనూ నాకు ముస్లిం కనిపించలేదు.ఏ ఒక్కరికీ నాలో హిందువు కనిపించలేదు.మానవత్వం నింపుకున్న ఇద్దరు మనుషులు తప్ప! ...

బతుకంటే ప్లాస్టిక్ పూల పరిమళం కాదు

ఎవరి మెప్పు కోసం బతుకుతున్నావ్?! నీకు నొప్పేస్తే ఎవ్వడూ ఏడ్చడు, నువ్వు తప్ప. నీ కోసం బతుకు, ఎవ్వడినీ నొప్పించక. మెప్పు కొరకు గొప్పలకు పోయి తిప్పలు పడకురా! మెప్పు కొరకు తప్పులు చేసి ఒప్పులుగా బొంకకురా! నవ్వైనా, ఏడుపైనా ,కష్టమైనా ,సుఖమైనా.. ముసుగు తీసి బతకడం నేర్చుకో! ఎందుకంటే ప్లాస్టిక్ పూలు పరిమళం ఇవ్వలేవు మరి! ☄️శుభరాత్రి 🛌 ~ అడుసుమల్లి రవికుమార్

సమయం సందర్భం

చిత్రం

రెక్కలు

చిత్రం
గెలుపు,ఓటముల బాసలు "బ్రతికి" ఉండేందుకు అవే లెక్కలు! ప్రేమ,ద్వేషాల మూసలు మనసు మూలల్లో అవే నిక్కులు! ఆశ,నిరాశల ఊసులు రెప్పపాటు జీవితానికి అవే రెక్కలు! ~ అ. ర. కు

వివేకం

చిత్రం

నిజం

నిన్ను, కావాలి అని అనుకున్నవాళ్ళు నువ్వు చెడ్డవాడివి అయినా నీతో ఉంటారు. నిన్ను, వద్దు అని అనుకున్నవాళ్ళు నువ్వు మంచివాడివి అయినా వదిలేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు మంచివాడివా... చెడ్డవాడివా అని కాదు, వాళ్ళకి నువ్వు అవసరమా... లేదా?! అంతే!

జీవితం

చిత్రం

చావైనా...బ్రతుకైనా

ఎక్కడ చూసినా ఒకటే వాసన ' పేద బతుకుల ఆకలి' ఎటు చూసినా ఒకటే రచన  'చిరిగిన చీరల రోదన' చచ్చిపోదాం బాబాయ్..  దేశం కోసం,కలం కోసం, అక్షరం కోసం బ్రతికేద్దాం బాబాయ్.. మనం పోయాక ఒక్కడన్నా మన గురించి ఒక్క అక్షరమైనా రాసేలా ఓ కన్నైనా మనకోసం ఒక్క కన్నీటి బొట్టు కార్చేలా!

గర్వం వద్దు

చిత్రం

నీ ధర్మం నువ్వు చెయ్

చిత్రం

conditions or Love

చిత్రం

మనిషి అంటే మరెవరో కాదు

పూవుల లాలిత్యానికి మురిసి పో మనసులో మాలిన్యాన్ని ఊహించకు ఫలము లోని మధురత్వానికి లొంగిపో హృదయములో దౌర్భల్యాన్ని ఊహించకు ఖడ్గాలు కడుపులో దాయకు,విసిరేయ్ అన్యాయం పైన  ఆగ్రహించు,దుర్మార్గం పైనే సెలయేరవ్వు బండరాళ్ళ మధ్య పారేందుకు 'మనిషి' అంటే మరెవరో కాదు నువ్వేనోయ్!  ~ అడుసుమల్లి రవికుమార్

మొరగడం కుక్క లక్షణం,గర్జించడం సింహం లక్షణం

చిత్రం

పిరికితనమే మరణం

చిత్రం

నాన్న గారి మాట

చిత్రం

నాన్న

చిత్రం
నాన్న .......నాన్న అంతే

"నేనే" కారాగారం

నాకు "నేనే" కారాగారం.. అది భద్రత అనుకుంటాం..కానీ అదే బంధనం అది అస్థిత్వం అనుకుంటాం..కానీ అదే అగాధం అది వైభవం అనుకుంటాం..కానీ అదే విహీనం అది మరేదో కాదు.."నేనే" అనే అహం! దానిని ఎంత పట్టించుకుంటే అంత పతనమవుతాం దాని పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత స్వార్ధ పరులవుతాం దానిని ఎంత విస్మరిస్తే అంత విముక్తులవుతాం అహంకారం మనకు మనమే కట్టుకున్న కారాగారం అందులోంచి విడుదలయితేనే మనకు స్వేచ్చా విహారం! ~ అడుసుమల్లి రవికుమార్

మంచి

చిత్రం

రంగులు

రంగులెన్నున్నా విడివిడిగా కనువిందు చేయగలవా ఏడు రంగుల కలయికేగా అంబరంలో సంబరం! మానవ జీవితం రంగుల కలయిక ఎర్ర రంగు సూర్యుడు పచ్చ రంగు అవని నీలపు రంగు ఆకాశం తెల్ల రంగు వర్షం రంగే లేని గాలి ఇవి కలిస్తేనే మన శరీరం!! కష్టం సుఖం కోపం ప్రేమ జాలి అసూయ ద్వేషం.. ఇవీ రంగులే!! ఏ రంగు నీ మనసుకంటుకుంటుందో ఆ రంగే నీ చేతులకంటుకుంటుంది గా!! విధి నీకు ఏ రంగు పూసినా నీ పెదవంచుకి నవ్వుల రంగేసెయ్ గాయాలెంతగా నీ ఎదను తడుముతున్నా..!! ~ అడుసుమల్లి రవి కుమార్ హోలీ పండుగ శుభాకాంక్షలు 💐 💐

ప్రయత్నిద్దాం

చిత్రం

భగవంతుని సంకల్పం

అడవికి దగ్గరగా వున్న  కుగ్రామంలో,  ఒక సోమరి యువకుడు వుండేవాడు.  వాడికి తల్లిదండ్రులు పెట్టిన లక్షణమైన పేరు(నారాయణ) ఉన్నా,  అది యెవరికీ తెలిసేది కాదు. ఎందుకంటే, వాడు యెప్పుడూ, యెవరైనా యేదైనా వుచితంగా యిస్తారేమో, అని యెదురుచూస్తూ, వాళ్ళు పెట్టింది తిని, గమ్యం లేకుండా, కాలక్షేపం చేస్తుండేవాడు. అందుకని గ్రామస్తులు వాడికి  ' పరాన్నభుక్కు '  అని పేరు పెట్టి చులకనగా చూసేవారు. . స్వతహాగా బద్ధకస్తుడు అవడం వలన,  తిండీతిప్పలు సులభంగా జరిగిపోయే ఉపాయం కోసం వెదుక్కోవడం అలవాటు చేసుకున్నాడు.  ఎక్కడ యేవిధమైన సంతర్పణలు వున్నా,  అవి పెళ్ళిభోజనాలైనా,  పితృకార్యాలైనా, హాజరయ్యేవాడు ఆ క్రమంలో, ఒకరోజు మన పరాన్నభుక్కు,  ఒక పండ్లతోటలో చెట్టెక్కి,  పళ్ళు కోసే ప్రయత్నంలో వుండగా,  తోటమాలి,కర్ర పట్టుకుని వస్తుంటే,  వాడిని చూసి, భయపడి, పరాన్నభుక్కు, దగ్గరలోని అడవిలోకి,  పరుగుతీసాడు,  దాక్కుందామని.  అడవిలో పరాన్నభుక్కుకు తినడానికి యేమీ దొరకలేదు.  మళ్ళీ, నెమ్మదిగా గ్రామంలోకి వద్దామని ప్రయత్నిస్తుండగా,  ఒక చిత్రమైన దృశ్యం అతని...

ఎన్నో

మౌనం మాట్లాడితే లిపి లేని మాటలెన్నో.. కాలం కాసేపు ఆగితే కనపడని కలతలెన్నో.. గతానికి గడువునిస్తే మరపురాని గురుతులెన్నో.. బాధలను మరవనిస్తే కన్నీటికి వీడ్కోలులెన్నో.. ఆనందాలు గుర్తొస్తే వికసించే నవ్వులెన్నో.. నిన్నటిని వదిలేస్తే రేపటికి ఆశలెన్నో.. నేటిని ఆస్వాదిస్తే మిగిలిపోయే మధురిమ లెన్నో... శుభోదయం 🌷 మళ్లీ నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ఫిబ్రవరి 29ని మరుపురాని రోజు గా మార్చుకుందాం!

సమస్యలు తీరుతాయి

చిత్రం

చిగురులేద్దాం రేపటి రాయభారుల్లా

🌃 శుభరాత్రి 🤹 దుఃఖాన్ని చిరునవ్వుతో బంధించి గాయాన్ని రెప్పలతో మూసి  రాత్రిని కలల్తో అలంకరిద్దాం ఏకాంతాన్ని జ్ఞానంతో అంటించి చీకటి దుప్పటి కప్పుకుని బూడిదై  పొద్దున్నే కొత్త ముఖం తొడుక్కుందాం బతుక్కిదే చిట్ట చివరి క్షణమైనట్లు  నిట్ట నిలువునా నిప్పుకణమై భగ్గుమందాం ఊరంతా తగలబడినా కాలిన మొండి గోడల్ని చీల్చుకుని ఎన్ని గింజలు తలెత్తుకుని చిగురించడం లేదూ…? అలాగే… మనమూ మళ్ళీ… చిగురులేద్దాం రేపటి ఆశల రాయభారుల్లా!! ~ అడుసుమల్లి రవికుమార్

నానీలు

చిత్రం

నిలబడాలి

చిత్రం

నిజం

చిత్రం
నిజమైనదేమిటో నీకు పూర్తిగా తెలియకుండానే, నువ్వు చూస్తున్న ప్రతి దానికీ నిజమని పేరు పెట్టకు

శివయ్యా..

చిత్రం
శివయ్యా... 🙏 ఆదుకుని, ఆర్తి తీర్చే తండ్రీ🙏 నీ పైన నా భక్తి.. భాష తెలియని భావమంటి మనసులో అలుపు తెలియని భావోద్వేగపు కడలి! 🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱 ~ అ.ర.కు

తల్లిదండ్రుల బాధ్యత

చిత్రం

మంచోడు

చిత్రం
ఒకరిని... మంచోడని గౌరవించడానికీ, నీకు మంచి చేశాడని గౌరవించడానికీ చాలా తేడా ఉంది బాసూ...! అభిప్రాయాలెప్పుడైనా అంతరంగం నుండి పుట్టాలి కానీ,అందుతున్న అవసరాలు నుండి కాదు! ~ అ.ర.కు

నమో వెంకటేశ

చిత్రం
🥀 *శ్రీ వేంకటేశ్వర స్తోత్రం* 🥀 కమలా కుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో | కమలాయతలోచన లోకపతే విజయీ భవ వేంకటశైలపతే || ౧ || సచతుర్ముఖషణ్ముఖపంచముఖ ప్రముఖాఖిలదైవతమౌళిమణే | శరణాగతవత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే || ౨ || అతివేలతయా తవ దుర్విషహైరనువేలకృతైరపరాధశతైః | భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే || ౩ || అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతాత్ | పరదేవతయా గదితాన్నిగమైః కమలాదయితాన్న పరం కలయే || ౪ || కలవేణురవావశగోపవధూ శతకోటివృతాత్స్మరకోటిసమాత్ | ప్రతివల్లవికాభిమతాత్సుఖదాత్ వసుదేవసుతాన్న పరం కలయే || ౫ || అభిరామగుణాకర దాశరథే జగదేకధనుర్ధర ధీరమతే | రఘునాయక రామ రమేశ విభో వరదోభవ దేవ దయాజలధే || ౬ || అవనీతనయాకమనీయకరం రజనీకరచారుముఖాంబురుహమ్ | రజనీచరరాజతమోమిహిరం మహనీయమహం రఘురామ మయే || ౭ || సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయమమోఘశరమ్ | అపహాయ రఘూద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే || ౮ || వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి | హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ || ౯ || అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాఽఽగత్య సేవాం కరోమి | సకృత్సేవయా...

మీ పూర్తి సామర్థ్యం వెలికి తీయండి

చిత్రం

నాన్న గారి మాట

చిత్రం

కండబలం...గుండెబలం

చిత్రం

ఆస్వాదించేయ్

రాలిన పూవు మట్టిలో కలిసిపోతుంది వాలిన చూపు ఎక్కడో నాటుకుపోతుంది కురిసిన వర్షం వంకలో వాగులో చివరకు సముద్రంలో కలిసిపోతుంది పొద్దుటి వెలుగు మీదకు చీకటి తరుముకొస్తుంది చీకటి పంచిన కలలను ఏ వెలుగో తుడిచేసిపోతుంది నిన్నటి రాత్రి నేటి రాత్రి ఒక్కటి కాదు నిన్నటి వెన్నెల ఇవాళ్టి వెన్నెల వేరు వేరే మధ్యలో ఈ కాలం గొడవేమిటి  గుండ్రని భూమికి దిశలేమిటి? ఎటు వెళ్ళినా నీవు ముందుకే వెళ్తావు- నీ జీవితాన్ని నీవు ఇటు నుంచి అటూ అటు నుంచి ఇటూ జీవిస్తావు ఎటు వెళ్ళినా ఇక్కడికే వస్తావో లేక ఎక్కడికైనా పోతావో? ఏమైతేనేం? నీ కాలం నీ ప్రాణం నీ ప్రయాణం ఒక్కటే అయినప్పుడు! ఏమైపోతేనేం? నీ గానం నీ గాయం నీ జ్ఞాపకం నీ వెన్నంటే వస్తున్నప్పుడు! జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించేయ్ ఎందుకంటే ఒక్కోసారి గెలుపే ఓటమి,ఓటమే గెలుపు మరి! ~ అడుసుమల్లి రవి కుమార్

ఆనందోబ్రహ్మ

మట్టిలోంచి పొడుచుకొచ్చి  పచ్చగా మెరిసిపోతోంది గడ్డి మొక్క. మట్టితునక మంచు చినుకు దాని ఠీవి ముందు నిలబడలేక జారిపోతున్నాయి. తాళలేని ఎండకు ఏమాత్రం వెరవట్లేదు సాలె పురుగు శ్రద్ధగా  గూడు అల్లుతోంది. రాబోయే ఆహారాన్ని ఊహించుకుంటూ. బండరాళ్లను అనువుగా పైకెత్తటానికి ప్రణాళికల్లో  మునిగిన ఇంజనీర్ లా కష్టపడుతోంది చీమ. తీపి ముక్కను గూటికి చేర్చడానికి. ఎక్కడన్నా శూన్యం పొడసూపుతుందేమోనన్న విధి కర్తృత్వం తో అటూ ఇటూ తిరుగుతూ బిజీగా ఉంది గాలి. గమనిస్తూ ఉంటే చైతన్యం నిత్య చైతన్యం లా అణువణువునా అనుభవ మౌతోంది విశ్వం  చైతన్యం... నిత్య నూతనం పరిణామం క్షణం క్షణం. ఆనందం అనుక్షణం ఆనందోబ్రహ్మ.

మా నాన్న..మా హీరో

పిలను కనడం,పెంచడం వాళ్ళు వృద్ధి లోకి వస్తే ఆనందించడం ప్రతీ తండ్రి చేసేదే...ఐతే?? పిల్లలను తనకు నచ్చినట్లు పెంచే నాన్నలు కొందరు,తన పిల్లలకు నచ్చినట్లు వాళ్ళను పెంచే నాన్నలు కొందరు (మా నాన్న లాగా). పిల్లలు పడిపోకుండా నడవడం నేర్పే నాన్నలు కొందరు,పడినా లేచి నడవడం నేర్పే నాన్నలు కొందరు (మా నాన్న లాగా). పిల్లలకు కష్టం అంటే తెలియకుండా పెంచే నాన్నలు కొందరు,కష్టాల్లోనూ ఎదిగేలా పెంచే నాన్నలు కొందరు (మా నాన్న లాగా). కథల్లో కవితల్లో కనిపించే నాన్నలు కొందరు,తానే కథగా కవిత గా స్ఫూర్తినిచ్చే నాన్నలు కొందరు (మా నాన్న లాగా). పిల్లలకు బ్రతకడం నేర్పే నాన్నలు కొందరు, జీవించడం నేర్పే నాన్నలు కొందరు (మా నాన్న లాగా). పిల్లలకు ఆస్తి పంచి ఆనందించే నాన్నలు కొందరు,తన అస్థితోనే విలువలు పంచే నాన్నలు కొందరు (మా నాన్న లాగా). పిల్లలకు తన గౌరవమర్యాదలనూ హోదానూ వారసత్వం గా ఇచ్చే నాన్నలు కొందరు,ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని ధనంగా ఇచ్చే నాన్నలు కొందరు(మా నాన్న లాగా). నాన్న... నీ గురించి చెప్పాలంటే సముద్రమంత ఇంకుతో ఆకాశమంత కాగితంపై రాసే కావ్యమైనా సరిపోదు!! My Dad is My Hero ~ అడుసుమల్లి రవి కుమార్ శుభరాత్రి 🌌🌉