నిండావు ప్రాణంగా

కనులకు కాటుక అద్ది,
కనుసైగ చేసావు చాటుగా..
నుదుటన సింధూరం దిద్ది,
నా జీవితంలోకి వచ్చావు ఆశలు రేపగా...
మనసుకు తలపులు రుద్ది,
నా చెంత చేరావు తోడు-నీడ గా..
గుండెకు ఊపిరులూది,
మారావు నా శ్వాసగా..
జీవిత మధురిమ పెరిగే కొద్దీ
నిండావు నా అణువణువులో ప్రాణంగా..!

~ అడుసుమల్లి రవికుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం