మా నాన్నే నాకు నారాయణుడు
🄼🅈 🇩 🇦 🇩 🄸🅂 🄼🅈 🇭 🇪 🇷 🇴 ♥️ మా నాన్నే నాకు నారాయణుడు ♥️ జీవితమనే పంట భూమిలో, కష్టమనే హలాన్ని చేత బట్టి, సంసారమనే తడీ-పొడీ బీడు భూమిని సాగు చేసి, బాధ్యత, బరువు అనే చెమట ధారలతో కుటుంబ సేద్యాన్ని చేసి, తన ఆకలిదప్పులు లక్ష్య పెట్టక మా ఆకలి తీర్చిన నిస్వార్ధ నిత్య కర్షకుడు మా నాన్న! కొవ్వొత్తిలా కరిగినా, కష్టాలు చుట్టుముట్టినా, చిరునవ్వే ఆయుధంగా నా జీవిత ఆకాంక్షల మణిపూసలని ఒక్కొక్కటిగా కూర్చి, మాల లా అల్లి, నా మెడలో వేసిన సూత్రధారి మా నాన్న! "పదార్థంలో కాదు, యదార్థంలో జీవించండి" అని మాకు బోధ చేసిన మా నాన్నే, నాకు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దశావతారుడైన నారాయణుడు! ~ అడుసుమల్లి రవి కుమార్