నీడ దుప్పటి

ఇంత నీడ దుప్పటి, మీదేసి

చెట్టు మౌనంగా కూర్చుంటుంది.

చుట్టూ పరుచుకున్న నీడ మీద

ఏడు రంగుల్ని కలగంటూ,

ఆకుపచ్చదనంతో అబ్బుర పరుస్తుంది.

 చెట్టు నీడన సేద దీరమంటూ

ఏకాంతం కుక్క పిల్లై  వెంటపడుతుంది.

అరుపుల్లేని ప్రేమలోకమొకటి

పిట్టల గుంపై వచ్చి మీద వాలుతుంది.

ఎండ నిట్టూర్పుల అలలు

నీడ తీరంతో యుద్ధం చేస్తూ,

చెట్టు మొదలుకు

తలలు బాదుకుంటున్నాయి,

హాయి లోకానికి స్వాగతం పలుకుతూ..!

~ అడుసుమల్లి రవి కుమార్ 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం