వివాహ వార్షికోత్సవం

మనసులు ముడి పడి
అడుగులు జత పడి
కొంగుముడితో ఇష్టంగా కట్టబడి
ఏడడుగులు నడిచి మనువాడి
మది గుడిలోన
బంధం బలపడిన ఘడియలు

అసంపూర్ణ జీవితానికి అనుకోని అతిధిగా
ఆజన్మాంతము జతగా ఉండే ఆత్మబంధువై, అర్థాంగిగా వచ్చిన
అపురూపమైన మధుర క్షణాల వైవాహిక సంపూర్ణ జీవితానికి నవ వసంతాలు నేటితో ..

ఆత్మీయతా అనుబంధాలను అందాల అల్లికగా అమర్చి
మమతానురాగాలను మైలురాళ్లుగా మలచి
పంచుకున్న పెంచుకున్న అనుభూతులను మధుర జ్ఞాపకాలుగా చేసి
బతుకుబాటలో బంధాలను, బాంధవ్యాలను బహుమతిగా ఇచ్చి

దిగులు దుప్పటిలో దాగివున్నప్పుడు,
రెప్ప పడని క్షణాల్లో
ఓదార్పు పలకరింపుల చినుకులతో
అలిసిన మనసుకు ఆలంబనగా
చిరునవ్వు వెలుగులతో స్వాగతం పలుకుతూ

ఆశల తీరాల ప్రయాణంలో
నా అడుగుజాడలలో అండగా,
ఆసరాగా వుంటూ
అంతరంగంలోని ఆలోచన తరంగాలకు అనునిత్యం ఆత్మవిశ్వాసాన్ని అందిస్తూ
ఆశలకు ఆశయాలకు వారధిలా
అందించే సహాయ సహకారాలకు
అభివందనములర్పిస్తూ..

అభినందనలతో.....భగవంతుని రక్షణ లో

మన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు💖

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వలయం

కొత్త సంవత్సరం