కెరీర్

ప్రస్తుత పరిస్థితులలో ప్రతి విద్యార్థి చదువుకునే దశలో తీసుకోవలసిన నిర్ణయాలలో అత్యంత కీలకమైనది తన జీవితంలో ఏ కోర్సులు చదవాలి,ఏ కెరీర్ ను ఎంచుకోవాలి అనే అంశమే!

కెరీర్ను ఎంపిక చేసుకోవడానికి
1. ఆసక్తి
2. నైపుణ్యం
3. వ్యక్తిత్వం
4. సాధారణ అనుకూల పరిస్థితి
5. అవకాశాలు
అనే పంచ సూత్రాల నియమాన్ని పాటించాలి.

పదవ తరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి ఉపాధి పొందాలంటే ఉత్తమ మార్గం పాలిటెక్నిక్.

పారిశ్రామిక శిక్షణా సంస్థలలో ఐ టి ఐ కోర్సు తీసుకున్న వ్యక్తులు ఒక్కో పనిలో పూర్తి నైపుణ్యం పొంది త్వరగా ఉపాధి పొందవచ్చు.

వ్యవసాయ రంగం అనేది భారతదేశానికి వెన్నెముక వంటిది దాని అనుబంధ రంగాలపై పట్టు సాధించేందుకు డిప్లమా ఇన్ అగ్రికల్చర్ కోర్సును పూర్తి చేసి మంచి ఉపాధి పొందవచ్చు. అలాగే డిప్లమా ఇన్ హార్టికల్చర్ అనే కోర్సు కూడా మంచి ఉపాధి అందిస్తుంది.

కానిస్టేబుల్, టికెట్ కలెక్టర్, ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, ఎల్ఐసి ఏజెంట్, సైనికుడు, coast guard, ఎయిర్మెన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోస్ట్ మాన్, ఫైర్ సేఫ్టీ, హోటల్ మరియు టూరిజం కెరీర్ను పదవ తరగతి తర్వాత ఎంపిక చేసుకోవచ్చు.

10 వ తరగతి తరువాత ఇంటర్మీడియట్ చదివి ఇంజనీరింగ్ మర్చంట్ నేవీ వంటి కోర్సులను చేయవచ్చు. అలాగే ఫైన్ ఆర్ట్స్, లలిత కళలు కూడా కోర్సులుగా ఎంచుకోవచ్చు. ఐ ఐ ఐటి ద్వారా ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సును చదవచ్చు.

ఇవే కాకుండా ఆయుర్వేద, బ్యూటీషియన్, ల్యాండ్ సర్వేయింగ్, టైలర్, మెకానిక్, హౌస్ వైరింగ్, సెల్ఫోన్ రిపేరింగ్, ఫోటో ల్యామినేషన్, బుక్ బైండింగ్, రబ్బర్ స్టాంప్ మేకింగ్, సర్టిఫైడ్ బిల్డింగ్ సూపర్వైజర్, వంటి స్పెషల్ కోర్సులను చేయవచ్చు.

ఇక ఇంటర్మీడియట్ తర్వాత ఫార్మసీ, సైన్స్, ఆర్ట్స్, మేనేజ్మెంట్లలో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫ్యాషన్ డిజైనింగ్, బీఎస్సీ, బీకాం, బి ఏ ,బి బి ఎం, పైలెట్, ఎయిర్ క్రాఫ్ట్మెయింటెనెన్స్, ఎన్డీఏ, స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ షిప్, ఎంబీఏ, ఎంసీఏ, వంటి గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసి మంచి ఉపాధి పొందవచ్చు.

మెడిసిన్, వెటర్నరీ, అగ్రికల్చర్, హోమియోపతి, ఆయుర్వేద, బీడీఎస్, ఫిజియోథెరపీ, ఫార్మసీ, నర్సింగ్, మెడికల్ రిలేటెడ్ కోర్సులన్నీ కూడా మంచి ఉపాధి అందించేవే. కాకపోతే వీటి కొరకు ఎంసెట్ నీట్ పరీక్షలను రాసి మంచి ర్యాంకులను సాధించాల్సి ఉంటుంది. బైపీసీ విద్యార్థులకు ఈ అవకాశాలు ఉన్నాయి.

ఇంటర్మీడియట్ తరువాత కామన్ కెరీర్స్ టిటిసి, ఎల్ ఎల్ బి, జర్నలిజం, ఫారెన్ లాంగ్వేజ్, హోటల్ మేనేజ్మెంట్, బిఎఫ్ ఏ, బి బి ఏ, ఆడిటర్, టూరిజం, యానిమేషన్ మల్టీమీడియా, లైబ్రరీ సైన్స్, పారామెడికల్ ఈ కోర్సుల ద్వారా మంచి కెరీర్ ని పొందవచ్చు.

ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇండియన్ ఆర్మీ, గ్రూప్ ఫోర్ జాబ్స్, బ్యాంకు క్లర్క్స్, కానిస్టేబుల్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ ఆర్ బి, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఆర్మీ జాబ్స్, పోస్టల్ అసిస్టెంట్స్ వంటి గౌరవప్రదమైన కెరీర్ను ఎంచుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసి రకరకాలైన వృత్తి విద్యలలో నైపుణ్యాన్ని పొందవచ్చు.

మనకు ఓర్పు, ఆసక్తి ,సాధించాలన్న దృఢ సంకల్పం,ఉండాలేగానీ ఏ కోర్సు నైనా ఏ కెరీర్ నైనా ఎంచుకొని జీవితంలో అత్యున్నత శిఖరాలను అందుకోవచ్చు. చదువంటే ఇంజనీరింగఇంజనీరింగే కాదు. చదువంటే ఐఐటీ లే కాదు. ఒత్తిడిని జయించి మనకు నచ్చిన కెరీర్ను ఎంచుకొని ఆనందకరమైన జీవితాన్ని గడిపే మన హక్కును మనం అందుకుందాం. కార్పొరేట్ల మాయల గారడిలో పడి మన బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు.

అయినా నాకు ఒక విషయము తెలియక అడుగుతాను అందరు పిల్లలు ఐఐటీలకు వెళ్తారా చదువంటే ఇంజినీరింగేనా..?! తల్లిదండ్రులు మారండి. మీ పిల్లలకు ఏది నప్పుతుందో ఏది నచ్చుతుందో తెలుసుకొని వాళ్ల వాళ్ల అభిరుచులకు తగ్గట్టు వాళ్లని ప్రోత్సహించండి. ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం