వార్షికోత్సవం

మూడుముళ్లు ఏడు అడుగులతో ఒక్కటైన మన అనురాగ బంధం
ఇద్దరమూ కలిపి అల్లుకున్న అందమైన జీవితం!!

మన బంధం..
బతుకంతా చదవాల్సిన మంచి పుస్తకం
జంటపఠనంలోనే బోధపడేను అర్ధం!

మన బంధం..
పడుగుపేకల్లో నేస్తున్న వస్త్రం
తొలి అడుగుతో మొదలైన అల్లిక
పోగులు కలబడినా, అక్కడక్కడా చిక్కు పడినా,ఓరిమితో విడదీయాల్సిన ముడి

మన బంధం
చరిత్రకి చుట్టిన రంగుల కాగితం
గతాన్ని తడిమితే
తగిలే ఎన్నో గిల్లికజ్జాలు  
కలహాల విసవిసలు
మురిపాల మెరుపులు
విరహాల నిట్టూర్పులు
ప్రణయాల కవ్వింతలు

నీకు నేను నాకు నీవు అంటూ మొదలైన ఈ బంధం
నీకు నేనే నాకు నీవే అంటూ కడ దాకా నడిచే తోడులో విశదమయ్యే మంత్రం

యేండ్లు గడుస్తున్నకొద్దీ మరింత పటిష్టంగా మారిన మన పెళ్లిపుస్తకానికి ఈనాటికి (26.7.2009) 10 సంవత్సరాలు నిండాయి..

జీవన గమనంలో ఎదురయే సునామీలనైనా, సుడిగుండాలనైనా, సుఖదుఃఖలనైనా...
సంఘటితంగా సకాలంలో సహనంతో సమన్వయంతో  ఆహ్వానిస్తూ
మన సంసార జీవితం సకల సౌకర్యాలతో,సిరి సంపదలతో, సాదరంగా, సంక్షేమంగా సాగిపోవాలని స్ఫూర్తి దాయకంగా, మధుర స్పృతులను మిగిల్చాలని...భగవంతుని ప్రార్ధిస్తూ

దశమ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను💐💐

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం