ఎన్నో

మౌనం మాట్లాడితే లిపి లేని మాటలెన్నో..
కాలం కాసేపు ఆగితే కనపడని కలతలెన్నో..
గతానికి గడువునిస్తే మరపురాని గురుతులెన్నో..
బాధలను మరవనిస్తే కన్నీటికి వీడ్కోలులెన్నో..
ఆనందాలు గుర్తొస్తే వికసించే నవ్వులెన్నో..
నిన్నటిని వదిలేస్తే రేపటికి ఆశలెన్నో..
నేటిని ఆస్వాదిస్తే మిగిలిపోయే మధురిమ లెన్నో...

శుభోదయం 🌷
మళ్లీ నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ఫిబ్రవరి 29ని మరుపురాని రోజు గా మార్చుకుందాం!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం