చిగురులేద్దాం రేపటి రాయభారుల్లా

🌃 శుభరాత్రి 🤹

దుఃఖాన్ని చిరునవ్వుతో బంధించి
గాయాన్ని రెప్పలతో మూసి 
రాత్రిని కలల్తో అలంకరిద్దాం

ఏకాంతాన్ని జ్ఞానంతో అంటించి
చీకటి దుప్పటి కప్పుకుని బూడిదై 
పొద్దున్నే కొత్త ముఖం తొడుక్కుందాం

బతుక్కిదే చిట్ట చివరి క్షణమైనట్లు 
నిట్ట నిలువునా నిప్పుకణమై భగ్గుమందాం

ఊరంతా తగలబడినా
కాలిన మొండి గోడల్ని చీల్చుకుని ఎన్ని గింజలు తలెత్తుకుని చిగురించడం లేదూ…?

అలాగే… మనమూ మళ్ళీ…
చిగురులేద్దాం రేపటి ఆశల రాయభారుల్లా!!

~ అడుసుమల్లి రవికుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం