బతుకంటే ప్లాస్టిక్ పూల పరిమళం కాదు
ఎవరి మెప్పు కోసం బతుకుతున్నావ్?!
నీకు నొప్పేస్తే ఎవ్వడూ ఏడ్చడు, నువ్వు తప్ప.
నీ కోసం బతుకు, ఎవ్వడినీ నొప్పించక.
మెప్పు కొరకు గొప్పలకు పోయి తిప్పలు పడకురా!
మెప్పు కొరకు తప్పులు చేసి ఒప్పులుగా బొంకకురా!
నవ్వైనా, ఏడుపైనా ,కష్టమైనా ,సుఖమైనా.. ముసుగు తీసి బతకడం నేర్చుకో!
ఎందుకంటే ప్లాస్టిక్ పూలు పరిమళం ఇవ్వలేవు మరి!
☄️శుభరాత్రి 🛌
~ అడుసుమల్లి రవికుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి