నాకేమైంది

నాకేమైంది?

అంతా నేనే అనుకుంటున్నాను,
నన్ను నేను గుర్తించలేక పోతున్నాను!

కాళ్ళకు గజ్జె కట్టుకునే ముందు
కళ్ళకు అద్దుకోటం మరిచి పోతున్నాను!

విద్యను ప్రదర్శించేముందు గురువు గార్ని
గుర్తు చేసుకోలేక పోతున్నాను!

ఆర్జన మాత్రమే చేస్తున్నాను
అనుభూతిని విస్మరిస్తున్నాను!

స్వయం శక్తి విలువ తెలియక
సిఫార్సులకు తంటాలు పడుతున్నాను!

ఎదుటివాడి మెప్పుకోసం
వ్యక్తిత్వం తాకట్టు పెడుతున్నాను!

విలువలేని వాడికి గులామునవుతున్నాను!
గందరగోళం తాళంలో కంగాళీ చేస్తున్నాను!

అమ్మో ఇప్పుడు ప్రవచనం వచ్చే వేళైంది,
ఆలోచిస్తూ కూర్చుంటే అది మిస్సవుతుంది!

అందుకనే ఆలోచించటం మానేస్తున్నాను,
తలుపులు మూసి తలపుల్ని బయటకు గెంటేస్తున్నాను!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం