అమృతం
నిను తలచిన క్షణాలన్నీ నేనాస్వాదించే పరిమళాలైతే, నాలో దాగున్న నీ భావాలన్నీ కమనీయ కావ్యాలే!
ఇన్నాళ్లు నను పెనవేసుకున్న ఈ మౌనాలు,
ఒక్క నీ పిలుపుతో చెల్లాచెదురైనవి భలేగా!
నీ కళ్ళల్లో పడి నా చూపులు పరిక్షేపణమైనవి
ఆ కళ్ళల్లో ఏ గమ్మత్తులు దాచావో!?
అనంతమైన ఆందోళనను దాచుకున్న ఈ గుండె,
నీ నవ్వుల చప్పుడు వినబడక నిర్జీవమైపోదా
కాలం కౌగిళ్లకు బందీలమవుతూ,
జీవితపు మాధుర్యాన్ని మర్చిపోతున్నాం మనం!!
మనిషిని హత్తుకునే ప్రేమ ఔషధమేమో
మనసు ను హత్తుకునే ప్రేమ అమృతమే!
~ శుభరాత్రి
అడుసుమల్లి రవికుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి