మంటలు
మంటలు.. మంటలు.. మంటలు
మనిషిని దహించే మంటలు
మనిషి పోయాక
కాల్చేస్తాయి దేహన్ని
చితి మంటలు!
ఉన్నపుడేమో
దహించి వేస్తాయి
గుండెను
ఈర్ష్య,అసూయలనే మంటలు!
చితి మంటలు చచ్చిన వారినే బూడిద చేస్తాయి.
ఈర్ష్యాసూయల మంటలు మానవత్వాన్నీ బూడిద చేసేస్తాయి!
꧁శుభరాత్రి꧂
~ అడుసుమల్లి రవికుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి