ఎర్రని కాంతి
జీవిత యుద్ధ సన్నాహం ఎప్పటికీ ముగిసిపోనిది, మరణం వరకూ.
మన లోపల దాక్కున్న నిజమైన మనతో ధైర్యంగా బయటకు రాలేని దౌర్భాగ్యపు బ్రతుకులు మనవి,
యుద్ధం అనివార్యం.
జీవితం యొక్క అసలైన ప్రయోజనం జీవించడం.
కానీ మనం ఇది తప్ప అన్నీ చేస్తాం,
మన అస్తిత్వాన్ని అన్వేషణ చేయాలన్నది వాస్తవం.
జీవితపు విలువను, మనిషి మనసును, లోకం తీరును నిర్దాక్షిణ్యంగా చూపించే కొన్ని క్షణాలుంటాయి,
సంఘర్షణ ప్రత్యక్షం.
ఉషోదయాన కనిపించే ఈ ఎర్రటి కాంతి,
ఏడ్చి ఎర్రబడిన కళ్ళదైతే కావొచ్చు, కానీ అది రగిలే ఉత్సాహానికి సంకేతమయ్యేట్టుగా..ప్రతీ ఉదయం క్రొత్తగా నాలుగు కాలాల పాటు గుర్తుండేలా రాసుకోండి.!
~ అడుసుమల్లి రవి కుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి