నేను నాలాగే
నాకు పరిచయమైన వారి మనసులో...
నేను ఒక సామాన్య వ్యక్తిని
నన్ను అర్థం చేసుకున్న వారి మనసులో...
నేను ఒక అద్భుతమైన వ్యక్తిని
నాపై అసూయపడే వారి మనసులో...
నేను ఒక పొగరుబోతు వ్యక్తిని
నన్ను మోసగించే వారి మనసులో...
నేను ఒక అమాయక వ్యక్తిని
నన్ను అపార్థం చేసుకున్న వారి మనసులో...
నేను లోకంలోనే చెడ్డ వాడిని
నన్ను ప్రేమించేవారికి మాత్రం నేనే ప్రపంచం.
నా అభిప్రాయలు వెళ్లబుచ్చే సమయాన
ఏకీభవించలేని మనసుకి నేను మొండివాడిని
ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం.
ఒక్కొక్కరి దృష్టికి నేను ఒక్కోలా కనపడతా!
అందుకే...
ఎవరి కోసమో నేను మారాలని లేదు.
నన్ను నాలానే బ్రతకనివ్వమని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
~ అడుసుమల్లి రవికుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి