యాప్ యాప్ ఉర్రే

యాప్ యాప్ ఉర్రె..మనమిక గొర్రే!!!

యాప్పులట...

మనిషిలోని
ఆర్ధ్రతని ఆవిరి చేసేవి కొన్ని
అనుబంధాల తీపిని చప్పగా చేసేవి కొన్ని
సృష్టించిన వాడినే ఆడుకునేవి కొన్ని
మనిషి ని రోగిష్టి ని చేసి కుదించేవి కొన్ని
డిజిటల్ లైఫ్ ని వండి వార్చి వడ్డించి 
మనిషి తత్వాన్ని మర్డర్ చేస్తున్నాయి అన్నీ!

మనిషిని కట్టు బానిసగా చేసి
గుడిలో, బడిలో, మదిలో,పనిలో..
తమ సోదితో అప్ డేట్ చేస్తున్నాయి కదూ?

అందరూ పరుగెత్తుతున్నారు
ఎదురొచ్చినవాళ్ళను గుద్దుకుంటూ..
సహాయం, నీతి, నిజాయితీ,
ప్రేమా, జాలీ, కరుణలు యాప్పుల కొలతలే.. 

ఇహ ఇప్పుడవి మనిషిని
తొక్కేసి, ఎక్కేసి ఎగబాకి పోతున్నాయి
అనంత విశ్వ "రహస్య"మంతా తమలో నింపుకుని,విశ్వాంతరపు ముఖంతో
వున్న వాటికి దాసోహం కాని దెవరు!?

ఏ ఒక్కర్నీ వదలకుండా
అందర్నీ పరుగెత్తిస్తున్నాయవి.

డిజిటల్ సంద్రంలో పడి యాప్లను మింగిన మనిషిని..దారి, దరి చేర్చేవి పుస్తకాలే!
మనకు మన మూలాలు నేర్పే అసలైన యాప్ లు పుస్తకాలే!!

~ అడుసుమల్లి రవికుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం