"నేనే" కారాగారం

నాకు "నేనే" కారాగారం..

అది భద్రత అనుకుంటాం..కానీ అదే బంధనం
అది అస్థిత్వం అనుకుంటాం..కానీ అదే అగాధం
అది వైభవం అనుకుంటాం..కానీ అదే విహీనం
అది మరేదో కాదు.."నేనే" అనే అహం!
దానిని ఎంత పట్టించుకుంటే అంత పతనమవుతాం
దాని పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత స్వార్ధ పరులవుతాం
దానిని ఎంత విస్మరిస్తే అంత విముక్తులవుతాం
అహంకారం మనకు మనమే కట్టుకున్న కారాగారం
అందులోంచి విడుదలయితేనే మనకు స్వేచ్చా విహారం!

~ అడుసుమల్లి రవికుమార్







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం