రంగులు
రంగులెన్నున్నా విడివిడిగా కనువిందు చేయగలవా
ఏడు రంగుల కలయికేగా అంబరంలో సంబరం!
మానవ జీవితం రంగుల కలయిక
ఎర్ర రంగు సూర్యుడు
పచ్చ రంగు అవని
నీలపు రంగు ఆకాశం
తెల్ల రంగు వర్షం
రంగే లేని గాలి
ఇవి కలిస్తేనే మన శరీరం!!
కష్టం సుఖం కోపం ప్రేమ జాలి అసూయ ద్వేషం..
ఇవీ రంగులే!!
ఏ రంగు నీ మనసుకంటుకుంటుందో
ఆ రంగే నీ చేతులకంటుకుంటుంది గా!!
విధి నీకు ఏ రంగు పూసినా
నీ పెదవంచుకి నవ్వుల రంగేసెయ్
గాయాలెంతగా నీ ఎదను తడుముతున్నా..!!
~ అడుసుమల్లి రవి కుమార్
హోలీ పండుగ శుభాకాంక్షలు 💐 💐
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి