నా అక్షరాలు

నే రాసే అక్షరం...
గుండె చీల్చుకొచ్చినా నెత్తురోడదు.. భావాలు, భావోద్వేగాలనే ఒలికిస్తుంది తప్ప!
కన్నీటిలో పుట్టుకొచ్చినా కాగితాన్ని తడుపదు..బాధని, ఆవేదనను ఒంపుతుంది తప్ప!
ప్రేరణ నింపేలా పిడికిలి బిగించినా...
మనిషిలోకి తొంగిచూసే తలుపై తెరిచినా..
మదిలోకి ప్రసరించే వెలుగై నిండినా...
నా అక్షరాలు చెదరని, బెదిరని సూర్య చంద్ర ప్రకాశాలు!

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం