ఐదు సంపదలు

పది మందికి - సహాయపడాలి అంటే ఎంత డబ్భు అవసరం?

మనలో ప్రతి ఒక్కరం ఇతరుల కష్టాలకు చలిస్తాం. కానీ పై విధంగా ఆలోచిస్తాం.

మీరు ఇతరులతో పంచుకోగల ఐదు సంపదలను కలిగివున్నారని మీకు తెలుసా!?

మొదటిది.. మీ ముఖం 
మీరు ఇతరులతో నవ్వును పంచుకోవచ్చు.ఇది ఉచితం.ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది.
 
రెండవది మీ కళ్ళు
మీరు ప్రేమ మరియు శ్రద్ధతో  ఇతరులను చూడవచ్చు.

మూడవది మీ నోరు
ఈ నోటితో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు.మంచిని చర్చించి, సత్సంగములో చేర్పించి, సానుకూలతను వ్యాప్తి చెందించగలరు.

నాలుగవది మీ హృదయం
మీ దయగల హృదయంతో, భగవంతున్ని ప్రార్థిస్తూ మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు.ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు.వారి హృదయాలను తాకవచ్చు.

మీరు కలిగి ఉన్న ఐదవ సంపద మీ శరీరం
ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు.అవసరమైన వారికి చేతనైన సహాయం చేయవచ్చు.

సహాయం  చెయ్యడానికి  ఒక చిన్న శ్రద్ధ, సంజ్ఞలు చాలు. అవి కొన్ని జీవితాలను వెలిగించగలవు.

భగవంతుడు మనకిచ్చిన జీవితం సర్వోత్తమమైనది!
ప్రతిక్షణం ఆనందంగా ఉంటూ, పదిమందికి చేతనైన సహాయం చేస్తూ, మన జన్మను చరితార్థం చేసుకోవడమే మన జన్మకు సార్థకత.

           🥀 శుభరాత్రి🥀
~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం