మండు వేసవిలో కుండపోత వర్షం
మండు వేసవిలో కుండపోత వర్షం....
💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦
పిలవని పేరంటానికి వచ్చిన అతిథి కాదు,
ఎండిపోయిన మాను, మోడు కు ప్రాణదీపం.
మట్టి గంధపు పరిమళాల దివ్య వాహిని.
ఎండ మంటకు కమిలిన గాయాలకు భిషక్కు.
పశు, పక్షి గణాల దప్పిక తీర్చే చలివేంద్రం.
మాసిన బతుకులు శుద్ధి చేసే పరిచారిక.
భూగర్భంలో ఇంకిపోయే అమృతధార.
~ అడుసుమల్లి రవి కుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి