పోరాడు...గెలిచేస్తావ్
ఈ బరువు మోయలేవు!
బిగ్గరగా అరవాలనుకుంటావు.
నీలోంచి నీ చేయే నీ నోరు మూసేస్తుంది.
కలల వంతెన మీద జారి పడుతున్నప్పుడల్లా,
అగాధం కండ్ల ముందుకొచ్చి భయపెడుతుంది.
పోరాడి పోరాడి ఓటమి ముందు
కుప్పకూలిపోవటానికి నిన్ను నువ్వే అప్పగించుకునే పరిస్థితులు వస్తాయి.
గతంలోకి తొంగి చూడకు.
మానని గాయాలు చేతులకు తగులుతాయి.
నడుస్తూ నడుస్తూ వెనుకకు తిరిగావా
పాత స్మృతులేవో నిన్ను తగులబెట్టి చలి కాచుకుంటాయి.
రాళ్ల దెబ్బల గుర్తులకు కాలమే మందు
గాయాలు పాతవే,
తెగింపే ఎప్పుడూ కొత్తగా వుండాలి.
నీ ఆశయాలకి నువ్వే కదా "ది ప్రిన్స్"!
ఉపాయం కనిపెట్టి, ఓర్పుగా, నేర్పుగా పోరాడు..గెలిచేస్తావ్!
శుభోదయం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి