నీకంటే తోపెవ్వడు లేడిక్కడ

మదిని మెలిపెడుతున్న మాటల ప్రవాహాలు,
మతిని చెడగొడుతున్న జ్ఞాపకాల సమూహాలు,
తనకు తానే లేని ఒంటరి పయనాలు,
మనసే ప్రత్యర్ధైన కఠిన సమరాలు,
ప్రయత్నమే లేక  ఓడిపోతూ, మళ్ళీ మళ్ళీ ఒంటరయ్యే సమయాన..

తను గీసిన పరిధిని దాటి విధి ఆడితే..
విధి ఆడిన వింత ఆటలో నువ్వు పావుగా మారితే..
మౌనముద్ర దాల్చిన బ్రహ్మను నిందించలేక,
మూగబోయిన మహావిష్ణువుని మాటైనా అనలేక,
కాంక్షించిన కోర్కెలు కనుమరుగవుతుంటే,
ఊపిరిసలపని ఊసులు ఊగిసలాడుతుంటే,
కనుల వాకిట బంగారు భవిత చితికిపోతుంటే
చితికిన కోర్కెలనడుమ బతుకు ఏమవుతుందో??

అప్పుడే నీలోని శూన్యం లోకి ఒక్కసారి తొంగి చూడు.. దీర్ఘశ్వాస తీసుకో, మళ్లీ మొదలెట్టేయ్!

నీకంటే తోపెవ్వడూ లేడిక్కడ!!

~ అ.ర.కు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం