పుస్తకం మన అస్తిత్వం
పుస్తకం....
నా ఒంటరి నేస్తం!
అజ్ఞానపు దారిలో
వెలుగు దీపం!
కాలక్షేపానికి మందు
ఉత్సాహానికి ప్రేరణ
నిరాశకు బద్ధ శత్రువు
బద్ధకానికి బుద్ధి చెప్పే గురువు!
ఒంటరితనంలో నీడలా వెంటుండే తోడు.
మస్తకాలను పదునుపెట్టే సానరాయి!
ఆలోచనల నిప్పురవ్వల్ని రాజేసే చెకుముకి రాయి!
కొత్త లోకపు మెట్లు ఎక్కించి
మైమరపింపచేసే మాయా దర్పణం!
అక్షరాల తోటలో నిత్య పరిమళాల సుగంధం
మానవునికి దైవం అందించిన వరప్రసాదిని!
చదవండి...చదివించండి..చదవడం మాకిష్టం అనేలా!!
పుస్తకం మన అస్తిత్వం.
~ అడుసుమల్లి రవి కుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి