యోధుడివి

జీవితంలో ఒక్కోసారి..
ఆగిపోతావ్, దిగాలుపడిపోతావ్
"పోవడం" కామనైనప్పుడు
ఎదిగి పోయినా, చితికి పోయినా
పోతూనే ఉండు!
అందరికీ దండలో పూలే కావాలి.
అవే ఊడిపోతే, దారాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు!
గెలుపు గుంపుని తీసుకొస్తే,
ఓటమి ఒంటరితనాన్ని తీసుకొస్తుంది! 
గుంపే నిజం అని గెలుపులో మురిసిపోతాం, మనమే నిజం అని ఓటమిలో తెలుసుకుంటాం!
నీకు నువ్వే అనుకొని ప్రయాణం సాగిస్తూ ఉండు!
చెయ్యరా యుద్ధం
నీవొక యోధుడివి పుట్టుక తోనే!!

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం