సన్ ఆఫ్ సూర్య నారాయణ
నాన్నా...
⚜️కాస్తంత కష్టం ఎదురైన ప్రతిసారీ మీరు చూసిన ఎత్తుపల్లాలు గుర్తొస్తాయి.
⚜️మీ గుండె నిబ్బరం గుర్తొస్తుంది. కుటుంబమంటే మనమే కాదు, మన తోటి వాళ్ళు కూడా అనే మీ ఔదార్యం గుర్తొస్తుంది.
⚜️ఎవరెన్ని తప్పులు చేసినా, క్షమించిన మీ ప్రేమ గుర్తొస్తుంది.
⚜️మీరు నేర్పిన జీవిత పాఠాలు గుర్తొస్తాయి.
⚜️కష్టాలెన్ని ఎదురైనా చలించని మీ ధీరత్వం గుర్తొస్తుంది.
⚜️ఆస్తుల కన్నా చదువే గొప్పదన్న మీ మాటలు గుర్తొస్తాయి.
⚜️అసలేం లేకున్నా, బాధ పడని మీ ధైర్యం గుర్తొస్తుంది.
⚜️అన్నిటికీ మించి మా స్వేచ్ఛను, మా ఆశల్ని సజీవంగా ఉంచిన మీ గొప్ప వ్యక్తిత్వం గుర్తొస్తుంది.
⚜️మీరు ఎప్పటికీ మా మార్గదర్శి..మా టార్చ్ బేరర్.
అందుకే నేనంటాను ❤️మై డాడ్ ఈస్ మై హీరో❤️
~ సన్ ఆఫ్ సూర్య నారాయణ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి