రోజులే చినుకులు
రోజులు అనే చినుకులు
ఒక్కొక్కటి,ఒకటి తరువాత ఒకటి
నన్ను నెమ్మదిగా తాకుతూ,వేగంగా కరిగిపోతున్న
కాలమనే వర్షమిది.
దేహాన్ని వదిలి నేలలో ఇంకిపోకుండా
మది తటాకంలో జ్ఞాపకాలుగా దారి వెతుక్కునే చుక్కలు కొన్నే!
ఆ తాకిడిలో పొందిన అనుభూతిని,
గాయాల కోతలని,అనుభవాలుగ మిగులుస్తాయి ఆ చుక్కలు .
జ్ఞాపకాలు నగమైన ఈ మదిలో
లక్ష్యాలు,ఆశలు చేప పిల్లలై తిరుగుతాయి
భవిష్యత్తుపై కనే కలలని ఆహారంగా తింటూ
రొజు రోజుకీ లావెక్కుతాయి.
జీవితం శిశిరంలోకి జొరపడుతూ
ప్రాణం ఆకులా రాలిపొయే క్షణం దాక
తీరినన్ని ఆశలు తీరుతాయి,తీరనివి
కనపడని సమాధులవుతాయి
దేహంలో ఆత్మలాగ.
అప్పుడు మనమే ఒక జ్ఞాపకం
మనం విడిచి వెళ్ళిన లోకానికి.
.
ఒక్కొక్కటి,ఒకటి తరువాత ఒకటి
నన్ను నెమ్మదిగా తాకుతూ,వేగంగా కరిగిపోతున్న
కాలమనే వర్షమిది.
దేహాన్ని వదిలి నేలలో ఇంకిపోకుండా
మది తటాకంలో జ్ఞాపకాలుగా దారి వెతుక్కునే చుక్కలు కొన్నే!
ఆ తాకిడిలో పొందిన అనుభూతిని,
గాయాల కోతలని,అనుభవాలుగ మిగులుస్తాయి ఆ చుక్కలు .
జ్ఞాపకాలు నగమైన ఈ మదిలో
లక్ష్యాలు,ఆశలు చేప పిల్లలై తిరుగుతాయి
భవిష్యత్తుపై కనే కలలని ఆహారంగా తింటూ
రొజు రోజుకీ లావెక్కుతాయి.
జీవితం శిశిరంలోకి జొరపడుతూ
ప్రాణం ఆకులా రాలిపొయే క్షణం దాక
తీరినన్ని ఆశలు తీరుతాయి,తీరనివి
కనపడని సమాధులవుతాయి
దేహంలో ఆత్మలాగ.
అప్పుడు మనమే ఒక జ్ఞాపకం
మనం విడిచి వెళ్ళిన లోకానికి.
.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి