జీవితం
జీవనమే ఒక సాగరము
ఎత్తు పల్లాల కెరటాలతో సాగే పయనము
నీ దారిన సొర చేపలే ఉన్నా
ముక్కలు చేసే మొసలే ఉన్నా
నీ పట్టు వీడబోకు..
సాహసమే నీకున్న బలము
సహనమే సంపదగా సాధించేయి విజయము....!!
నీడె నిన్ను భయపెడితే ఆ నేరం వెలుగుదా
నలుసే నిన్ను భాధపెడితే ఆ దోషం కంటిదా
నేస్తం చూడు జీవితం అంటే నిత్యం సమరమే
సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే
పారిపోకు ఏ ఓటమికి ప్రపంచాన్ని విడిచి..
ఆరని అగ్నిజ్వాలే మన జీవితం.!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి