అలుపూ...గెలుపు
అలుపులేని ఓ కెరటమా
ఇలా ఎలా
ఎన్ని యుగాలైనా
తీరంతో నీ పోరాటం ఆపవుగా
గెలుపు ఓటముల్లో
అలుపన్నది ఎరుగక
ఒడ్డుకు చేరాలనే నీ ఆరాటం..వహ్వా
పడిలేస్తానంటావు
వడి వడిగా సంద్రం
ఒడిలోకి జారుకుంటావు.!
అలుపులేని అలా
ఇలా ఎలా.!?
ఆదర్శమంటే నీవే..పడిలేచే యువతరానికి.
గెలుపంటే, పడినా లేవడమేగా మరి.!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి