నాన్న నాన్న నాన్న నీ మనసు గొప్పది


 మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని  తన కన్నీళ్లను దాచేస్తాడు నాన్న! 

మన పెదవులపై  చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు నాన్న!

దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ..సంతోషాన్ని  మాత్రమే మనకు ఇస్తాడు నాన్న!

తన బిడ్డలు బాగుండాలని తపన పడుతూ..తపస్సు చేస్తాడు నాన్న!

మనమెరిగిన తొలి నేస్తం నాన్న

నడకలు నేర్పించిన తొలి భరోసా నాన్న

మనకోసం మన లోకమైన మన తోడు నాన్నే

మనతోనే ఉండి మనల్ని నడిపించేది నాన్నే

మన ఆశలే తన ఆయువుగా మన గెలుపే తన లక్ష్యంగా..

మన జీవితాన్ని నిలబెట్టేందుకు నిత్యం శ్రమించే నిస్వార్థ శ్రామికుడు నాన్న!

అందరూ నా వాళ్లే అనుకుంటూ జీవితాంతం ప్రేమాభిమానాలు పంచి నిస్వార్థంగా, కల్లా కపటాలు లేకుండా, తన కోసం తను ఎలా బ్రతకాలో కూడా తెలియకుండానే బ్రతికి వెళ్ళిపోయిన మా నాన్న రుణం ఎప్పటికీ తీర్చుకోలేను...


ఇవాల్టికి ఇంకా మీ ఫోన్లో మీ నాన్న పేరుతో ఫోన్ రింగ్ అవుతుంది అంటే మీరంతా ఎంతో అదృష్టవంతులు అని అర్థం!


ఏదో నీ నీడలో నా పని నేను చేసుకుంటూ బతికేవాడ్ని,

నాకక్కర్లేని పెద్దరికాన్ని ఇచ్చి వెళ్లిపోయావు కదయ్యా😓

నీ జ్ఞాపకాల పదునుకి నా గుండె గాయం ఇంకా మానలేదయ్యా😭


❤️నాన్న నువ్వే నా హీరో❤️

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం