దరహాసం

ఎండలో తపిస్తూ, వానలో తడుస్తూ తరిస్తూ మల్లె నవ్వడం లేదా తెల్లగా మరింత చల్లగా..

గుండె బ్రద్దలయినా, తారులో కాలుతున్నా ..గులకరాయి నవ్వడం లేదా కాలిక్రింద గలగలా..

హాలము గుండెను నిలువునా చీల్చినా..దరహాసపు మొలకలెత్తి పులకరిస్తోంది నేల..

మనసారా నవ్వుకోవడం మనకు మనమే నేర్చుకోవాల్సిన మంత్రం..

నవ్వైనా, ఏడుపైనా

జీవితం మధుర దరహాసమే అందుకో....    

చిరునవ్వుల వరముంటే  చిరకాలం జీవించగలం

ఆ దరహాసం కోసం
నీ అధరం ఎంతకాలం తపసు చేసిందో
ఆచిరునవ్వును ధరించాలని
నీ పెదవి ఎంతగా ఉబలాట పడిందో
అక్కడ తడి పొడి తపనలపై
నీరెండ పడి ఒక హరివిల్లు విరిసింది
ఆ రంగుల వేదిక పైన నా చూపులు ముడివడి
నాలో విరిజల్లు కురిసింది
ఆ మెత్తని పానుపు పైన
మత్తుగా గమ్మత్తుగా ఉన్నట్టుంది
ఆ మందహాసం ఎంత హాయిగా శయనించింది!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం