చిన్నారి పాప
చిన్నారి పాప నిదురపోవమ్మా
చిరుగాలులు చెప్పే చిలిపి కబురులింటూ
చిన్నారి పాపా నిదురపోవమ్మా
జోజో లాలిజో అని జోలపాట వింటూ
నా చిట్టి తల్లీ నిదురపోవమ్మా
పున్నమి రేయి కాయు జాబిలమ్మ నీకోసం
వెండిపూల వెన్నెళ్ళను విరిపిస్తుంటే
చీకటి వర్ణించే వెలుగు కథలు వింటూ...
మబ్బుల దారుల్లో కాంతి సిరులు ఒలికించే
చుక్కలు నీ భవితను పండిస్తుంటే
పువ్వులు దోసిట్లో చిరునవ్వులు తళుకులలో
తీయని నీ ఊహలు చిగురిస్తుంటే
రాతిరి తేబోయే వేకువ కల కంటూ...
వెచ్చని అమ్మ ఒడే మెత్తని శయ్యగా
మదిలో వెతనంతా తొలగిస్తుంటే
చల్లని నాన్న చేతిస్పర్శ నుదురంతా కదులుతూ
నిండుగ దీవెనలను కురిపిస్తుంటే
చింతలన్ని మరచిపోయి రేపటిని తలుస్తూ...
నా బంగారు తల్లులకు ప్రేమతో...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి