డబ్బు భలే జబ్బు

డబ్బు విలువ - నోటుపై ఉన్న
అంకెల్ని బట్టి కాదు భయ్యా .!

సంపాదించడానికి 
ఖర్చు చేసుకునే  జీవితం ,
వదులుకునే ఆత్మగౌరవం .

పొందడానికి
విడిచిపెట్టిన విలువలు ,
వద్దనుకున్న బంధాలు .

వెనకేసుకోవడానికి
పెనవేసుకున్న మోహాలు ,
కళ్ళుగప్పిన  మోసాలు .

దాచుకోవడానికి
దోచుకున్న జీవితాలు ,
పెంచుకున్న పలుకుబడులు .

వెచ్చించే కారణాలు
వంచించే దారుణాలు ,
తొక్కేసిన బ్రతుకులు ,
కొట్టేసిన పొట్టలు .!

అవసరం - అత్యవసరం ,
అవకాశం - అవకాశవాదం ,
ఆశ - అత్యాశల స్థాయిల్ని బట్టి .
నిర్ణయించడుతుంది డబ్బు అసలు విలువ  .

డబ్బులేకండా
సన్యాసి జానెడు పొట్టకీ
గంజి దొరకదు - కరెక్టే  ,

కానీ .,
ఈ డబ్బు  జీవితాన్ని నిలబెట్టే వరకే డబ్బు ,
పైదంతా కోలుకోలేని జబ్బు ,
తిరిగి వెనక్కి కొనుక్కోలేని ..
మురిగిపోయిన - జీవితపు గబ్బు !

దేన్ని పణంగా పెట్టి ఏం పొందుతున్నావో ,
దేన్ని ధారపోసి దేన్ని బావుకుంటున్నావో ,
తెలుసుకోలేకపోతే మనిషికి
ఇంత మెదడు ఎందుకసలు ..?

అడుసుమల్లి రవికుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం